Table of Contents
Chiranjeevi Tollywood Godfather.. మెగాస్టార్ చిరంజీవి.. కొత్తగా పరిచయం అక్కర్లేని పేరిది.!
ఆయన ఓ శిఖరం. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని క్రియేట్ చేశారాయన.!
చిరంజీవి ఏం ధరిస్తే అదే ట్రెండింగ్ డ్రస్.. చిరంజీవి ఏం మాట్లాడితే, అదే పవర్‌ఫుల్ డైలాగ్.. చిరంజీవి ఏం చేస్తే అదే అత్యద్భుతమైన డాన్స్.!
ఔను, చిరంజీవి చేసిందే డాన్సు.. చిరంజీవి చెప్పిందే డైలాగు.. చిరంజీవి వేసిందే డ్రస్సు.!
తెలుగు సినిమాకి నిర్వచనమే మార్చేసింది చిరంజీవి శకం. అంతకు ముందు వరకూ తెలుగు సినిమా పాటల తీరు తెన్నులు వేరు. తెలుగు సినిమా డాన్సులు వేరు. తెలుగు సినిమా ఫైట్లు వేరు.!
తెలుగు సినిమా గమనాన్ని మార్చిన చిరంజీవి..
అంతకుముందు తెలుగు సినిమా గమనం వేరు. ఔను, చిరంజీవి రాకతో తెలుగు సినిమా గమనమే మారిపోయింది.! చిరంజీవి, ఇంతకన్నా తెలుగు సినిమాకి ఇంకేమివ్వాలి.?

మెగాస్టార్ చిరంజీవి వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకున్నారు.. ఔను, అది నిజం. అదే సమయంలో, చిరంజీవి మీద కూడా వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు నిర్మాతలు. దటీజ్ చిరంజీవి.!
చిరంజీవితో డాన్స్ చేయడం ఓ అదృష్టం.. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ అదృష్టం. అప్పటికీ, ఇప్పటికీ ఇందులో మార్పు రాలేదు. ఇంతకన్నా చిరంజీవి గురించి గొప్పగా ఇంకేం చెప్పగలం.?
Chiranjeevi Tollywood Godfather.. చిరంజీవి.. ఇంకేమివ్వగలడు.?
సినిమాల ద్వారా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న కోణంలో, రక్తదానం అలాగే నేత్రదానాన్ని ప్రోత్సహించారు చిరంజీవి.
Also Read: కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్.. కార్లు కొనుక్కోలేరా.?
చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా సేవలందిస్తున్నారు. అంతేనా, కోవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించారు. ఇంకేం కావాలి.? చిరంజీవి ఇంకేం చేయాలి.?
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి..
ఇంకా సినీ పరిశ్రమకు ఏదైనా చేయాలన్న తపన.. నటుడిగా ఇంకా ఏదో సాధించాలన్న తపన. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.
తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి కొత్త లెక్కలు నేర్పాయి చిరంజీవి సినిమాలు. ఇంతకన్నా, చిరంజీవి సినీ పరిశ్రమకు ఇంకేం చెయ్యాలి.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. అన్ డిస్‌ప్యూటెడ్ కింగ్ ఆఫ్ టాలీవుడ్.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి.!