Chiranjeevi Trivikram Srinivas Combo.. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఆ కామెడీ టైమింగ్‌కి తోడు సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే డైలాగ్స్ చిరంజీవి నోట్లోంచి వస్తే.? అవీ త్రివిక్రమ్ (Trivikram Srinivas) మార్కు డైలాగులైతే.?
చిరంజీవి – త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో కలిసి పని చేశారు. అదీ ‘జై చిరంజీవ’ సినిమా కోసం. కానీ, ఆ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాదు, కేవలం మాటల రచయిత మాత్రమే.!
Chiranjeevi Trivikram Srinivas Combo.. అప్పట్లో అలా జరిగిపోయిందిగానీ..
‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.! అప్పటి ఈక్వేషన్స్ వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.
తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema Tollywood)) స్టార్ డైరెక్టర్స్ అనదగ్గరవారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Guruji Trivikram Srinivas) వెరీ వెరీ స్పెషల్.!
అడపా దడపా ఆయన సినిమాలు బెడిసి కొట్టినా, ‘గురూజీ’ అన్న గుర్తింపు మాత్రం ఆయనకు అలాగే వుండిపోయింది. ‘మాటల మాంత్రికుడు’ అన్న ఇమేజ్ ఎప్పటికీ చెరిగిపోదు కూడా.!
చిరంజీవి సినిమాకి దర్శకత్వం ఎప్పుడు.?
నిజానికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా ఈపాటికే తెరకెక్కాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కాస్త ఆలస్యమవుతూ వస్తోంది.
తాజాగా చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ (Padma Vibhushan Chiranjeevi) పురస్కారం ప్రకటించిన దరిమిలా, ఆయన్ని కలిసి అభినందించారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Also Read: ‘లైగర్’ హీరో.! ‘యానిమల్’ బ్యూటీ.! కాంబినేషన్ కెవ్వు కేక.!
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్ని చూసినవాళ్ళంతా ‘చిరంజీవి – త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడో.?’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
దేనికైనా టైమ్ కలిసి రావాలంతే.!
ఇదిలా వుంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సంక్రాంతికి మహేష్ హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా విడుదలైంది.
ఇంకోపక్క మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో ‘విశంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.