Table of Contents
Cinema Tickets Tollywood.. తెలుగు సినిమా ‘స్థాయి’ చాలా చాలా పెరిగిపోయింది. ఔను, ఓ ప్రముఖ హీరో రెమ్యునరేషన్ వంద కోట్లట.. అనేంతలా. నిజమేనా.? అన్నది వేరే చర్చ. ఓ సినిమా వసూళ్ళు వెయ్యి కోట్ల పైనేనంటూ కొన్నేళ్ళ క్రితం ప్రచారం జరిగింది. అదే ‘బాహుబలి’. అందులో ఎంత నిజముంది.? అంటే, దానికి సరైన సమాధానం దొరకదు.
ఫ్లాప్ సినిమాని కూడా వంద కోట్ల క్లబ్బులో వేసేస్తుంటారు అభిమానులు. వారి అత్యుత్సాహం అలాంటిది మరి. వంద కోట్ల రూపాయల వసూళ్ళంటే, దానికి తగ్గట్టుగా ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిందే కదా.? కానీ, కట్టే పన్నులకి.. ప్రకటించే వసూళ్ళకీ అస్సలు పొంతన వుండదు.
Cinema Tickets Tollywood.. ప్రశ్నిస్తారు సరే.. బాధ్యత వుండక్కర్లేదా.?
సినిమా అనగానే, ఎగేసుకుంటూ ఇలా ప్రశ్నించెయ్యడమేనా.? వేల కోట్లకు అధిపతులైన రాజకీయ నాయకులు, తమకు సొంత కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొంటుంటారు. కానీ, అప్పుడెవరూ ప్రశ్నించరు. కానీ, అలాంటి రాజకీయ నాయకులు అధికార పీఠమెక్కితే.. అన్ని వ్యవస్థల్నీ ప్రశ్నించేస్తుంటారు. ఇదే మరి, రాజకీయ వైపరీత్యమంటే.

సరే, సినిమా టిక్కెట్ల వివాదం దగ్గరకి వద్దాం. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గడమంటే, అది ప్రేక్షకులకి పండగే. ఏ సినీ ప్రేక్షకుడు కూడా ఎక్కువ ధరకి సినిమా టిక్కెట్ కొనాలని అనుకోడు. విధిలేని పరిస్థితుల్లో, ఆ రోజు ఆ సినిమా చూసెయ్యాలన్న కోరికతో.. ఒక్కోసారి బ్లాక్‌లో టిక్కెట్ కొనే అవకాశముంటుంది. ఆ పాపం ముమ్మాటికీ థియేటర్ల యాజమాన్యాలదే.
భారం.. సినిమా టిక్కెట్లతోనేనా.?
సినిమా హీరోల్లో కొందరు ఈ సినిమా టిక్కెట్ల వ్యవహారంపై గుస్సా అవుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరల మాటేమిటి.? పెట్రోల్ ధరల సంగతేంటి.? అని సాధారణ ప్రజానీకంలోనూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికీ, దీనికీ లింకు పెట్టడం ఎంతవరకు సబబు.? అనేవారూ లేకపోలేదు.
అసలు ప్రభుత్వాలు, ప్రజల మీద భారాన్ని తగ్గించాలనుకుంటే.. చాలా భారాలు తగ్గించాలి. ఎందుకంటే, భారాలు మోపేది ప్రభుత్వాలే కాబట్టి. విద్యుత్ బిల్లులు, రకరకాల పన్నులు.. చెప్పుకుంటూ పోతే కథ చాలా పెద్దదే. ఎవరి గోల వారిది.
ఈ హీరోలు అప్పుడేమయ్యారు.?
కొత్త సినిమా విడుదల కాగానే, సినిమా టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసే థియేటర్ల యాజమాన్యాలకు, టిక్కెట్ల ధర తగ్గింపు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్ థియేటర్ల సీజ్.. అంటే మింగుడుపడని విషయమే. కానీ, వాటి వల్ల ప్రేక్షకుడికి వచ్చే నష్టమేమీ లేదు. అయితే, నిర్మాతలు నష్టపోతారు. పంపిణీదారులూ నష్టపోతారు. థియేటర్ల యాజమాన్యాల సంగతి సరే సరి.
Also Read: Bheemla Nayak.. చాలా గట్టిగా దెబ్బకొట్టేశారుగా.!
మరి, బ్లాక్ టిక్కెట్ల కారణంగా ప్రేక్షకులు నష్టపోయినప్పుడో.? ఏ హీరో కూడా, ప్రేక్షక దేవుళ్ళు దోపిడీకి గురవుతోంటే (Cinema Tickets Tollywood) వచ్చి కాపాడలేదు కదా.?