Table of Contents
వేరియంట్లు.. మ్యుటేషన్లు.. పేరేదైతేనేం, కరోనా వైరస్ (కోవిడ్ 19) కొత్త రకమంటూ రోజుకో కొత్త పేరు తెరపైకొస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్, లాంబ్డా, కప్పా.. ఇలా పుట్టుకొస్తున్న కొత్త పేర్లతో (Corona Virus Covid 19 New Variants New Waves) జనం బెంబేలెత్తుతున్నారు. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరుగుతోంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం ఎంత పెరుగుతోందో.. అంతకన్నా వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. తద్వారా మొదటి వేవ్, సెకెండ వేవ్, మూడో వేవ్.. ఇలా కొత్త కొత్త వేవ్స్ పుట్టుకొస్తున్నాయి. మరి, కరోనా వైరస్ నుంచి పూర్తిగా ప్రపంచం బయటపడేదెప్పుడు.?
తప్పదు, కరోనా వైరస్‌తో సహజీవనం చెయ్యాల్సిందే..
కరోనా వైరస్.. అదేనండీ కోవిడ్ 19తో సహజీవనానికి దాదాపుగా మానవాళి అలవాటుపడిపోయింది. దీన్ని ఇలా కొనసాగించెయ్యడమే. వ్యాక్సిన్ వేసుకున్నవారికి కరోనా సోకదన్న గ్యారంటీ ఏమీ లేదు. వ్యాక్సిన్ వేసుకున్నా ఫేస్ మాస్కులు ధరించాల్సిందే.. సోసల్ డిస్టెన్సింగ్ సహా, కరోనా రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలూ పాటించాల్సిందే.
Also Read: సినిమా రివ్యూ: ‘వకీల్ సాబ్’.. ది పవర్ కింగ్.!
కానీ, ఎన్నాళ్ళిలా.? అన్న ప్రశ్న సహజంగానే జనం నుంచి ఉత్పన్నమవుతుంది. అయితే, ప్రస్తతానికి ఆ ప్రశ్నకు సమాధానం లేదు గాక లేదు. భవిష్యత్తులో దొరుకుతుందనీ చెప్పలేం.
అ్రగ రాజ్యం అమెరికా కూడా కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. వ్యాక్సిన వేసుకుంటున్నాం కాబట్టి, ఫేస్ మాస్క్ అవసరం లేదనుకున్న చాలా దేశాల్లో తిరిగి కరోనా వైరస్ స్వైర విహారం కొత్త కొత్తగా షురూ అవుతోంది. దాంతో, ఫేస్ మాస్కుని ఇకపై ఓ తప్పనిసరి అవసరంగా భావించాల్సిందే.
కరోనా భయం పోయేదెప్పుడు.?
ప్రపంచమంతా పాకేసింది కరోనా వైరస్. అది పుట్టిన చైనాలో మాత్రం సందడి తక్కువగానే వుంది. అదే విచిత్రం. ప్రపంచాన్ని మాత్రం కరోనా భయం ఇప్పట్లో వీడేలా లేదు. ఇంకొన్నాళ్ళు ఈ భయంలోనే కొట్టుమిట్టాడాల్సిందే. అదెంత కాలం.. అంటే, అది మళ్ళీ మీలియన్ డాలర్ల ప్రశ్న.
అద్భుతం జరిగితే తప్ప, కరోనా వైరస్ (Corona Virus Covid 19 New Variants New Waves) నుంచి ఇప్పట్లో ప్రపంచం కోలుకునే పరిస్థితి లేదు.