Criminalisation Of Politics.. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. అత్యంత కిరాతకంగా చంపివేయబడ్డాడు.
‘జస్టిస్ ఫర్ దిశ’ అంటూ గతంలో దేశవ్యాప్తంగా నినదించిన సినీ ప్రముఖులు, సాధారణ ప్రజానీకం.. ఆ పదో తరగతి విద్యార్థి మరణాన్ని అస్సలు పట్టించుకోలేదు.
ఓ విద్యార్థి అత్యంత కిరాతకంగా చంపబడితే.. హుటాహుటిన బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయమంటూ హంగామా చేస్తారు.
అంతే, ఇక అక్కడితో ఆ విషయాన్ని అందరూ మర్చిపోవాల్సిందే. ఎందుకంటే, చంపేసింది.. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం.
హత్యలు చేసినోళ్ళకి ప్రత్యేక వెసులుబాట్లు..
పైగా, అధికార పార్టీ అధినేత సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి.. ఈ తరహా డెడ్లీ రాజకీయం చేస్తారు.
అయినాగానీ, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఆగ్రహావేశాలకు లోనుకాకూడదు.! ఇదండీ వరస.

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేస్తారుగానీ.. అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు.. చంపేసి, డెడ్ బాడీల్ని.. బాధిత కుటుంబాలకు డోర్ డెలివరీ చేసేస్తే పట్టించుకోరు.
అరెస్టులు జరిగినా, చాలా తీరిగ్గా జరుగుతుంటాయంతే.
Criminalisation Of Politics.. నేరస్తుల పాలనలో..
క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్.! దీన్నే జనసేన అధినేత పదే పదే ప్రస్తావిస్తున్నారు. ‘నిన్ను పాలించేవాడు.. నీకంటే నిజాయితీపరుడై వుండాలి’ అన్నది జనసేనాని నినాదం.
అంతే కాదు, ‘నేరస్తులు మనల్ని పరిపాలిస్తున్నారంటే.. మనకి సిగ్గుండక్కర్లేదా.?’ అన్నది జనసేనాని (Jana Senani pawan Kalyan) పదే పదే సంధిస్తున్న ప్రశ్న.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
పదో తరగతి విద్యార్థిని చంపేసిన ఘటననే తీసుకుంటే.. ‘అలాంటి ఘటన మన ఇంట్లో జరిగితే.?’ అన్న భయం ప్రతి ఒక్కరిలోనూ వుండాలి.
నేరమయ రాజకీయాల్ని ప్రశ్నించాలి, నిలదీయాలి. అదే పవన్ కళ్యాణ్ చేస్తున్నది. తప్పుని తప్పుగా చూడలేని పరిస్థితి.. అంటే, అది పతనానికి సంకేతం.!
రాజకీయం అనేది సేవ కోసం తప్ప.. నేరాల కోసం కాదు.! కానీ, నేరమే రాజకీయం అయిపోయిందిప్పుడు.!