David Warner Rajendra Prasad.. ‘వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేదు..’ అంటూ, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మీద విమర్శలు పోటెత్తుతున్నాయి.
కారణం, క్రికెటర్ డేవిడ్ వార్నర్ మీద, ‘రాబిన్ హుడ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే.
ఫన్ టోన్‌లోనే ఆ వ్యాఖ్యలు రాజేంద్ర ప్రసాద్ చేసి వుండొచ్చుగానీ, అది అస్సలేమాత్రం సభా మర్యాద కానే కాదు.! డేవిడ్ వార్నర్, ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటించాడు.
క్రికెటర్లు, సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. కాకపోతే, డేవిడ్ వార్నర్ వేరు. విదేశీ క్రికెటర్ అయినా, ఐపీఎల్ పుణ్యమా అని, అతనికి మన భారతదేశంలో బోల్డంతమంది అభిమానులున్నారు.
David Warner Rajendra Prasad.. రాబిన్ హుడ్ – డేవిడ్ వార్నర్..
మరీ ముఖ్యంగా, సన్ రైజర్స్ జట్టు తరఫున డేవిడ్ వార్నర్ ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో, అతనికి బోల్డంత రెస్పెక్ట్ వుంది తెలుగునాట.
సినిమా ప్రమోషన్స్ కోసం డేవిడ్ వార్నర్‌ని చాలా ప్లాన్డ్‌గా ఉపయోగించుకోవాలనుకుంది ‘రాబిన్ హుడ్’ టీమ్. అలాంటప్పుడు, అతనికి ఎంత గౌరవం ఇవ్వాలి.?

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కి సభా మర్యాద తెలియదని అనుకోలేం. కాకపోతే, నోరు జారేశారు.. ఫన్ జనరేట్ చేసే క్రమంలో. రాయడానికి వీల్లేని భాషలో తిట్టేశారు రాజేంద్ర ప్రసాద్.
దాంతో, సహజంగానే రాజేంద్ర ప్రసాద్ మీద విమర్శలు పోటెత్తాయ్. ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. ‘రాబిన్ హుడ్’ టీమ్, డేవిడ్ వార్నర్‌కి ఈపాటికే క్షమాపణ చెప్పి వుంటుంది ఈ విషయమ్మీద.
సభ్యత.. సంస్కారం.. అవసరమేమో రాజేంద్ర ప్రసాద్‌కి.!
కానీ, ఇలాంటి వేదికలపై నటులు, సంయమనం కోల్పోకూడదు. అది, సినిమాకి మంచిది కాదు.. సభ్యత అనిపించుకోదు కూడా.!
తెలుగులో బూతులు తిట్టేశారు రాజేంద్ర ప్రసాద్.. అవి అర్థం చేసుకుని, అంతే సరదాగా రాజేంద్ర ప్రసాద్‌ని ఇంగ్లీషులో డేవిడ్ వార్నర్ గనుక బూతులు తిట్టేస్తే.? అస్సలు జీర్ణించుకోలేం.
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
డేవిడ్ వార్నర్, క్రికెట్ ఆడటమే కాదు.. సోషల్ మీడియాలో తెలుగు పాటలకు డాన్సులేస్తూ కూడా తెలుగు సినీ అభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు.
అలాంటి డేవిడ్ వార్నర్‌ని సరదాకే అయినా, అవమానించాలని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎలా అనుకున్నారో ఏమో.!