Table of Contents
వెలుగుల దీపావళి సందర్బంగా ‘సినిమా’ ప్రేక్షకుల కోసం ఫస్ట్ లుక్స్, స్పెషల్ పోస్టర్స్ సందడి చేసేస్తున్నాయి. దీపావళి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన కొత్త సినిమా ‘వినయ విధేయ రామ’ టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ని తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. దాంతోపాటుగా ఇంకా చాలా ఫస్ట్ లుక్స్ వచ్చాయి.
డబ్బింగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’, అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లిసా’, తమిళ నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ‘వర్మ’.. ఇలా పలు సూపర్ లుక్స్ అభిమానుల కోసం వచ్చేశాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ ‘ఎఫ్2’ కొత్త లుక్‌తో దీపావళి విషెస్ చెప్పేశారు.
తమిళ హీరో ధృవ్‌తోపాటు అతని తండ్రి విక్రమ్ కూడా తన కొత్త సినిమా లుక్‌ని తీసుకొచ్చేశాడు. అఖిల్ అక్కినేని తన కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’ కొత్త లుక్‌తో వచ్చాడు. ‘ట్యాక్సీవాలా’ సినిమాతో ఈ నెల 18న ప్రేక్షకుల్ని పలకరించనున్న విజయ్, తన అభిమానులకి ఈ సినిమా కొత్త పోస్టర్‌తో విషెస్ అందించాడు.
తారల దీపావళి శుభాకాంక్షలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరిదీ ఒకటే మాట.. దీపావళి వేడుకల్ని సురక్షితంగా జరుపుకోవాలని. అందాల భామలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ తదితరులు తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘పటాకాలు పేల్చొద్దు.. పటాకాలా వెలగాలి జీవితాలు..’ అని ఆకాంక్షించింది మెహ్రీన్ కౌర్. ‘లోఫర్’ ఫేం దిశా పటానీ అయితే, దీపావళి కానుకగా హాటెస్ట్ లుక్‌ని విడుదల చేసింది.
బుల్లితెర భామలూ తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అందించేందుకు ప్రత్యేకంగా ముస్తాబై, ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందాల భామల దీపావళి శుభాకాంక్షలతో.. ఈ దీపావళి సరికొత్త వెలుగుల్ని సంతరించుకుంటోందని అభిమానులు.. తమ అభిమాన అందాల భామలకు రిప్లయ్స్ ఇచ్చేస్తున్నారు.
మాటల మాంత్రికుడి పుట్టినరోజు
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు నేడు. ‘గురూజీ..’ అంటూ ఆయన అభిమానులు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. దర్శక రత్న దాసరి నారాయణరావుని అందరూ ‘గురువుగారూ’ అని పిలుచుకునేవారు. ఆ తర్వాత ‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే కావడం గమనార్హం. ఇటీవల ‘అరవింద సమేత’ సినిమాని ప్రేక్షకుల ముందుకొచ్చిన త్రివిక్రమ్, తన తదుపరి సినిమా కసరత్తుల్లో బిజీగా వున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని అందిద్దాం.
విశ్వ నటుడికి బర్త్ డే విషెస్
విశ్వ నటుడిగా తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చిన కమల్‌హాసన్ పుట్టినరోజు నేడు. ఓ వైపు సినిమాలు ఇంకో వైపు రాజకీయాల్ని చక్కబెడుతున్న విశ్వ నటుడు కమల్‌హాసన్, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ హ్యాపీగా దీపావళి జరుపుకోవాలనీ, సేఫ్‌గా వుండాలనీ విజ్ఞప్తి చేశాడు. విశ్వ నటుడికి వివిధ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.
mudra369 తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు..