Table of Contents
Deepika Padukone.. సినిమా చాలా మారింది. ఎప్పటికప్పుడు సరికొత్త లెక్కలు సినిమా పరిశ్రమలో పుట్టుకొస్తున్నాయ్. కమర్షియల్ సినిమా అంటే అందులో అన్ని హంగులూ వుండాలి. గ్లామరూ, దాంతో పాటు ‘ఆ టైపు’ సన్నివేశాలూ ఇలాంటివన్నీ తప్పనిసరైపోయాయ్.
నిజానికి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. ఎప్పటి నుంచో నడుస్తున్నదే. హీరోయిన్లు ఏవైనా ఘాటు సన్నివేశాల్లో నటిస్తే, వెంటనే వాళ్ల మీదికి ప్రశ్నలు దూసుకెళ్తుంటాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే రోడు మీదికి లాగేస్తుంటారు వాళ్లని.. నిస్సిగ్గుగా.
చెంప ఛెళ్లుమనిపించిన Deepika Padukone
దీపికా పదుకొనె తన తాజా చిత్రం ‘గెహరాయియే’ ప్రమోషన్ సందర్భంగా చిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంది. ‘సినిమాలో కెమిస్ట్రీ బాగా పండించేశారు కదా.. మీ భర్త నుంచి అనుమతి తీసుకున్నారా.?’ అన్న ప్రశ్న ఎదురైంది. దీపిక కొంచెం ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకుని సరైన సమాధానమే ఇచ్చింది.
‘సినిమాని సినిమాలా చూడాలని.. నాకూ, నా భర్తకీ తెలుసు..’ అని దీపిక వ్యాఖ్యానించింది. కథను బట్టే సన్నివేశాలు వుంటాయనీ, వాటిని నిజ జీవితానికి ఆపాదించకూడదని దీపిక పేర్కొంది.
గతంలో సమంతకీ ఎదురైంది ఆ అనుభవం..
ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత మీద తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. అప్పటికి సమంత, నాగచైతన్య నుంచి విడాకులు తీసేసుకుంది. అంతకు ముందు నాగ చైతన్య భార్యగా వున్నప్పుడే ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి విమర్శల్ని ఎదుర్కొంది.
అయితే, అందులోని ఆమె నటనే అప్పటిదాకా ఆమెని విమర్శించిన వారికి ఘాటైన సమాధానమిచ్చింది. బాలీవుడ్ నటి మలైకా అరోరా ఓ సందర్భంలో తాను ఐటెం సాంగ్స్ చేయడం గురించి మీడియా ప్రశ్నిస్తే, నటన తన ప్రొఫిషన్ అనీ, పెళ్లయిన హీరోలు ఎలా హీరోయిన్లతో కెమిస్ట్రీ తెరపై పండిస్తారో తానూ అలాగే చేస్తున్నాననీ సమాధానమిచ్చింది.
టార్గెట్ హీరోయిన్లు మాత్రమే..
నిజానికి హీరోల్ని ఎవరూ ఇలాంటి ప్రశ్నలు వేయరు. వేస్తే ఏమవుతుందో వాళ్లకీ తెలుసు. అప్పనంగా హీరోయిన్లు దొరుకుతారు కాబట్టి. అభ్యంతరకర ప్రశ్నలు వేస్తారనేది చాలా మంది హీరోయిన్లు చాలా సందర్భాల్లో చెప్పేసిన మాటే.
Also Read: మాళవికకి మండింది.! మంట పెట్టిందెవరంటే.!
ఈ మధ్యనే ‘డీజె టిల్లు’ సినిమా హీరోయిన్ నేహాశెట్టి శరీరంపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయ్.? అంటూ ఓ జర్నలిస్టు సంధించిన ప్రశ్న తెలుగు సినీ పరిశ్రమలో ఎంత రచ్చ రేపిందో అందరికీ తెలిసిందే.
అన్నట్లు తమ సినిమాల ప్రమోషన్ నేపథ్యంలో ఒక్కోసారి నటీనటులు హద్దులు దాటేసి మితి మీరి చేసే ప్రవర్తన కారణంగా మీడియాకి సినీ జనాలు ఒకింత చులకనయిపోవడంలో వింతేముంది.