Table of Contents
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే ‘స్థాయి’ని తగ్గించేసింది. నటిగా తనను తాను మరింత గొప్పగా నిరూపించుకునేందుకోసం దీపిక విభిన్నమైన పాత్రల్ని ఎంచుకోవడం తప్పేమీ కాకపోవచ్చు.
కానీ, ఆ పాత్రల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందో, ‘గెహ్రాయియాన్’ సినిమా ఓ హెచ్చరికగా నటీమణులకు మారిందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఈ సినిమాలో మరో ప్రముఖ బాలీవుడ్ నటి అనన్య పాండే కూడా నటించింది. అయితే, అనన్యపై పెద్దగా విమర్శలు రాలేదు.. అది ఆమె అదృష్టం.
ఇంతకీ, దీపిక విషయంలో ఎందుకింతలా విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు.? ఎందుకంటే, ఈ సినిమాలో ఆమె పాత్ర అలాంటిది. దీపిక కాకుండా సి-గ్రేడ్ హీరోయిన్లెవరైనా ఆ సినిమా చేసి వుండొచ్చు.!
బోల్డ్.. బట్ నాట్ బ్యూటిఫుల్.!
ఎందుకింత ‘బోల్డ్’గా నటించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు దీపిక సమాధానమిస్తూ, ‘కథ పరంగా, పాత్ర పరంగా అది తప్పలేదు’ అని సెలవిచ్చింది. అంతలా ఆ సినిమాలో ‘బోల్డ్’గా కనిపించాల్సిన అవసరమేంటో చూసినవారెవరికీ అర్థం కాలేదు.
‘కక్కుర్తి’ తప్ప ‘బోల్డ్ సన్నివేశాలు తప్ప, కథ పరంగా ఆ అవసరమే లేదని ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. తెలుగులో ‘డర్టీ హరి’ సినిమా వచ్చింది. దాంట్లోనూ ఇదే తరహా కాన్సెప్ట్. కాకపోతే, చిన్న చిన్న తేడాలు.
తెలుగులో పండిన ఆ కాస్తో కూస్తో భావోద్వేగాలు బాలీవుడ్‌లో అస్సలు పండలేదు. నిజానికి, ‘డర్టీ హరి’ తెలుగులోనూ పెద్దగా వర్కువట్ అవలేదనుకోండి.. అది వేరే సంగతి.
దీపికా పడుకొనేని చూపించి, అనన్య పాండేతోనూ ప్రచారం చేయించేసి.. సినిమాని ‘సేల్’ చేసేసుకోవాలనుకున్నట్టున్నారు తప్ప, కథ కాకరకాయ్ లాంటివాటి గురించి అసలు ఆలోచించనే లేదు.
దీపికకి వీసమెత్తు ఉపయోగం లేని సినిమా.!
దీపిక వల్ల ఈ సినిమాకి అడ్వాంటేజ్ (బిజినెస్ పరంగా) అయ్యిందేమోగానీ, ఆమెకు ఈ సినిమా వల్ల చాలా చాలా డ్యామేజ్ జరిగింది.
చిత్రమేంటంటే, ‘ఇదేం సినిమా.?’ అని కనీసం భర్త రణ్‌వీర్ సింగ్ తన భార్య దీపికా పడుకొనేని వారించకపోవడం. అఫ్‌కోర్స్ ప్రొఫెషనల్ విషయాల్లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఎలాంటి ఒత్తిళ్ళూ పెట్టుకోకూడదని అనుకుంటే, అది వేరే సంగతి.
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
ఒక్కటి మాత్రం నిజం.. దీపికా పడుకొనే.. అంటే, ఆమె స్టార్‌డమ్‌కి ఓ రెస్పెక్ట్ వుంది. అదిప్పుడు దాదాపుగా పోయింది. విద్యా బాలన్ ‘డర్టీపిక్చర్’ సినిమా చేసిందంటే, అది ‘బోల్డ్ సినిమా’ అయినా, ఆ తర్వాత ఆమె పట్ల రెస్పెక్ట్ పెరిగింది. కానీ, దీపిక విషయంలో పూర్తి రివర్స్.
సరిదిద్దుకోలేని తప్పు చేసేసింది దీపిక పడుకొనే ‘గెహ్రాయియాన్’ సినిమాని ఒప్పుకోవడం ద్వారా. దాన్ని సరిదిద్దుకోవాలంటే, ఓ అద్భుతమైన పాత్రలో కన్పించాలి.!
అనన్య పాండే సంగతేంటి.?
దీపికతో పోల్చితే, అనన్య పాండే కెరీర్‌లో ఇంకా ప్రారంభ దశలోనే వుందని చెప్పాలి. అలాంటి అనన్య పాండే, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి తప్పిదాలు చేస్తే ఎలా.? నటన పరంగా చూస్తే ఆమెకు పెద్దగా ప్రాధాన్యత వున్న పాత్ర దక్కలేదు.
దీపిక లాగానే అనన్య కూడా అర్థం పర్థం లేని పాత్రలో కనిపించింది. అనన్య కెరీర్‌లో ఈ ‘గెహ్రాయియాన్’ ఓ బ్లాక్ స్పాట్ అవుతుందన్నది నిర్వివాదాంశం. ఏ ‘కక్కుర్తి’ దీపిక, అనన్యలను ఈ ‘కక్కుర్తి’ సినిమాలో నటించేలా ప్రోత్సహించిందో ఏమో.!