Table of Contents
Deepika Padukone బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనేకి కొత్త కస్టమొచ్చింది. తన తాజా చిత్రం ‘పఠాన్’ కోసం దీపిక వస్త్ర సన్యాసం బాగానే చేసింది.
నిజానికి, దీపిక తొలినాళ్ళ నుంచీ వెండితెరపై చేస్తున్నది అందాల ప్రదర్శనే.! దాంతోపాటు, నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పిస్తోంది. లేకపోతే, అంత పెద్ద స్టార్ ఎలా అవుతుంది.?
కొత్తగా ఇప్పుడేదో దీపికా పడుకొనే సినిమాల్లో వల్గారిటీ ప్రదర్శిస్తోందని అనగలమా.?
‘పఠాన్’ సినిమాని బ్యాన్ చెయ్యాల్సిందే..
షారుక్ ఖాన్ (Shahrukh Khan), దీపికా పడుకొనే కలిసి నటించిన ‘పఠాన్’ సినిమాని బ్యాన్ చేయాలనే ఆందోళనలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి.
హీరో హీరోయిన్ల దిష్టిబొమ్మల్ని ఆందోళనకారులు తగలబెట్టడమే కాదు, సినిమా విడుదలైతే థియేటర్లనీ ధ్వంసం చేస్తామంటున్నారు.
మరిప్పుడు ఏం చేయాలి.? షారుక్, దీపిక.. ఎవరికి క్షమాపణ చెప్పాలి.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు.
Deepika Padukone గ్రాఫిక్స్‌తో కవర్ చేయాల్సిందేనా.?
కొన్నాళ్ళ క్రితం ‘పద్మావత్’ (Padmavat) సినిమా కోసం దీపిక పడుకొనే చేసిన ఓ పాట, అందులో ఆమె కాస్ట్యూమ్ విషయమై అభ్యంతరాలొచ్చాయి.
దాంతో, చేసేది లేక మేకర్స్.. ఆ పాటలోని దీపిక దుస్తులకు గ్రాఫిక్స్ అతికించారు. ఎలాగోలా ఆ సినిమా గట్టెక్కింది.
సో, ఇప్పుడు కూడా అదే చేయాలా.? ‘పద్మావత్’ కథ, కమామిషు వేరు. ‘పఠాన్’ సంగతి వేరు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ రగడతో మొదలై..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ (Sushant Singh Rajput) అనుమానాస్పద రీతిలో బలవన్మరణానికి పాల్పడటంతో, అప్పటినుంచి ప్రతి సినిమాకీ ‘బ్యాన్’ అనే పదం తరచూ వినిపిస్తోంది.
Also Read: Mrunal Thakur ‘జిలేబీ’ బ్యూటీ.. చాలా నాటీ.!
కొందరు బాలీవుడ్ ప్రముఖులు నెపోటిజంని ప్రోత్సహిస్తూ అసలు సిసలు టాలెంట్‌ని తొక్కేస్తున్నారన్నది సోకాల్డ్ ఆందోళనకారుల ఆవేదన.
ఆ కోణంలోనే ‘పఠాన్’ సినిమానీ బ్యాన్ చేసెయ్యాలంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ చాలా చాలా నష్టపోయింది. ఈ వివాదాలతో ముందు ముందు బాలీవుడ్ తన మనుగడని కూడా కోల్పోతుందేమో.!