Devara Poster Edit Controversy.. జూనియర్ ఎన్టీయార్ ‘దేవర’ నుంచి వచ్చే కంటెంట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
సినిమా ప్రారంభమవడమే ఆలస్యం.! పైగా, నిర్మాణ సమయంలో రకరకాల సమస్యలు.. రిలీజ్ డేట్ కూడా అనుకున్న సమయానికంటే దూరం వెళ్ళింది.
మరి, ‘దేవర’ (Devara Movie) టీమ్ వదులుతున్న కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి.? ప్చ్.. అలాంటిదేం కనిపించడంలేదు.
Devara Poster Edit Controversy.. మరీ ఇంత నిర్లక్ష్యమా.?
కక్కుర్తి.. ఆపై నిర్లక్ష్యం.. వెరసి, జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) అభిమానులకి నిర్మాణ సంస్థపైనా, దర్శకుడిపైనా ఆగ్రహం, అసహనం పెరిగిపోతున్నాయి.
ఇంకా దారుణమైన విషయమేంటంటే, గతంలో వదిలిన పోస్టర్లపైనా చాలా విమర్శలొచ్చాయ్.. అయినా, ‘దేవర’ టీమ్ పద్ధతి మార్చుకోలేకపోతోంది.

తాజాగా, ‘దేవర’ నుంచి సెకెండ్ సింగిల్‌కి సంబంధించి అప్డేట్ ఇస్తూ, ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ నిజానికి.. బాగానే వుంది. అంటే, ‘పోజ్’ పరంగా.!
లీడ్ పెయిర్ జూనియర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్నారు. కానీ, ఆ స్టిల్‌తో డిజైన్ చేసిన పోస్టర్ మాత్రం అస్సలేం బాలేదు.
ఇదేం పోస్టర్ డిజైనింగ్.?
కింద కాళ్ళని బ్యాక్‌గ్రౌండ్‌లో మెర్జ్ చేసిన తీరుపై తీవ్రాతి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయ్. పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా, అందుబాటులో వున్న యాప్స్ వాడి.. ఇంతకన్నా గొప్ప ఎడిట్ చేయొచ్చు.
ఈ విషయమై అభిమానులు, చిత్ర నిర్మాణ సంస్థల్ని తప్పు పడుతున్నారు. దర్శకుడ్నీ తప్పుపడుతున్నారు.
‘అన్నా.. నువ్వైనా చూసుకోవాలి కదా..’ అంటూ జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) కి సైతం సూచన చేస్తున్నారు అతని అభిమానులు.
Also Read: బేబమ్మ కృతి శెట్టి అందాల ‘యోగ’మ్..!
మరీ ఇంత నిర్లక్ష్యమా.? భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతున్నప్పుడు, జస్ట్ ఫొటో ఎడిట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా.?
కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్టర్ విషయంలో ప్రధానంగా కొరటాల శివ మీదనే విమర్శలు పోటెత్తుతున్నాయ్. అనిరుథ్ ఈ ‘దేవర’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.