Dhruv Vikram Bison.. విలక్షణ నటుడు విక్రమ్ ఎలానో, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కూడా అంతే.! ధృవ్ విక్రమ్ సైతం, కొత్తదనంతో కూడిన కథల్ని ఎంచుకుంటున్నాడు.
తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఆదిత్య వర్మ’లో ధృవ్ విక్రమ్ హీరోగా నటించాడు.
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ విషయంలో ఓ చిత్రం చోటు చేసుకుంది. అదేంటంటే, రెండు సార్లు, ఆ సినిమా శాడు ధృవ్ విక్రమ్.
ఒకటి బాల దర్శకత్వంలో ‘వర్మ’ అయితే, ఇంకోటి గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య వర్మ’.

ఇక, ధృవ్ తదుపరి చిత్రం ‘మహాన్’, విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. తండ్రి విక్రమ్‌తో కలిసి నటించాడు ధృవ్ విక్రమ్ ఈ ‘మహాన్’ సినిమాలో.
ధృవ్ విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయ్ ‘మహాన్’ సినిమా విషయంలో.
కేవలం విక్రమ్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసెయ్యలేదు ధృవ్ విక్రమ్, సినిమాకి సంబంధించి వివిధ విభాగాల్లో పూర్తి శిక్షణ తీసుకున్నాకనే, నటుడిగా ధృవ్ విక్రమ్ తెరంగేట్రం చేశాడు.
‘బైసన్’తో తెలుగు మార్కెట్‌పై కన్నేసిన ధృవ్ విక్రమ్..
అలాంటి యంగ్, డైనమిక్ అండ్ టాలెంటెడ్ ధృవ్ విక్రమ్ నుంచి ‘బైసన్’ పేరుతో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఈ ‘బైసన్’ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తమిళంతోపాటు, తెలుగులోనూ ‘బైసన్’ సినిమా విడుదల కానుంది.
‘బైసన్’ చిత్రానికి దర్శకుడు మారి సెల్వరాజ్. విలక్షణ సినిమాలు తెరకెక్కించడంలో మారి సెల్వరాజ్ తనదైన ప్రత్యేకతను చాటుున్నాడు.

‘పెరియుమ్ పెరుమాల్’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన మారి సెల్వరాజ్ నుంచి ‘కర్నన్’, ‘వామనన్’, ‘వజయ్’ తదితర చిత్రాలొచ్చాయి.
‘వజయ్’ సినిమాకి మారి సెల్వన్ నిర్మాత కూడా.! అంతే కాదు, పలు సినిమాలకు ఆయన లిరిసిస్ట్‌గా కూడా పని చేశాడు.
బైసన్ స్పోర్ట్స్ డ్రామా..
‘బైసన్’ విషయానికొస్తే, సినిమా ప్రోమోస్ ఆల్రెడీ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ని అనూహ్యంగా పెంచేశాయి. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్‌ని చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు.
ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ మేకోవర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘బైసన్’ సినిమాలో ధృవ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.
స్పోర్ట్స్ డ్రామా కావడంతో, యాక్షన్‌కి మంచి స్కోప్ వుంటుంది ‘బైసన్’ సినిమాలో. ఎమోషన్స్ పండించడంలో, హీరో ధృవ్ తండ్రికి తగ్గ తనయుడని.. ‘బైసన్’ టీమ్ అంటోంది.
తెలుగులో ఈ సినిమాని జగదంబే ఫిలింస్ పతాకంపై, నిర్మాత బాలాజీ విడుదల చేస్తున్నారు. ‘బైసన్’లో ధృవ్ విక్రమ్ పెర్ఫామెన్స్ అత్యద్భుతంగా వుంటుందని నిర్మాత బాలాజీ అంటున్నారు.
Also Read: ‘జీనీ’ అబ్డీ అబ్డీ.! కృతి శెట్టికి సరైన పాట పడింది.!
‘బైసన్’ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా వుందనీ, సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత బాలాజీ.
కంటెంట్ వుంటే, డబ్బింగ్ సినిమాలు సైతం స్ట్రెయిట్ సినిమాల్ని మించి తెలుగులో విజయాల్ని అందుకుంటున్న సందర్భాలు చాలానే వున్నాయ్.
తమిళ హీరో విక్రమ్‌కి తెలుగులో మంచి మార్కెట్ వుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ‘బైసన్’ సినిమాతో ధృవ్ విక్రమ్‌కి సైతం తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలున్నాయి.
