Dil Raju.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తనకు గ్లామర్ ఎక్కువైపోయిందన్న భావనలో వున్నారు.! ఇంకేం, సినిమాల్లో హీరోగా ట్రై చేసుకోవచ్చు కదా.?
ఈ రోజుల్లో కథే హీరో.! తనకు సరైన కథ వెతికి పెట్టడానికి దిల్ రాజు దగ్గర చాలామంది దర్శకులున్నారు. ఆయనే నిర్మాత.! పైగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కూడా.!
గ్లామర్ బాగా ఎక్కువైపోయిందని అంత బలమైన నమ్మకమున్నప్పుడు ‘దిల్’ రాజు ఆలస్యం చెయ్యడం అస్సలు మంచిది కాదు.!
Dil Raju ‘వారిసు’ కష్టాలు.!
సినిమా నిర్మాణం కంటే, దాన్ని విడుదల చేయడమే కష్టంగా మారిపోతోందిప్పుడు. థియేటర్లపై గుత్తాధిపత్యమే ఇందుకు కారణం.
సినిమా నిర్మాణమంటే, ఓ తల్లి.. బిడ్డను కనడం కిందే లెక్క.! అలా తయారైంది పరిస్థితి. నిర్మాత దిల్ రాజు, ‘వారిసు’ సినిమాని తమిళనాట విడుదల చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడట.
కామెడీనే ఇది.! ఎందుకంటే, ‘వారిసు’ హీరో విజయ్. తమిళనాడులో స్టార్ హీరో. సో, థియేటర్ల సమస్య వుండదు. కానీ, సమస్య వుందని చెబుతున్నాడు దిల్ రాజు.
తెలుగులో పరిస్థితి వేరు..
తెలుగు నాట ఏదన్నా సినిమా తెరకెక్కాలన్నా, ఆ సినిమా విడుదలవ్వాలన్నా దిల్ రాజు ఆశీస్సులు వుండాలన్న బలమైన అభిప్రాయం నాటుకుపోయింది.
‘దిల్’ రాజుతో పెట్టుకుంటే సినిమాలు సజావుగా విడుదలయ్యే పరిస్థితి వుండదట. ఇదెంత నిజం.? అని ‘దిల్’ రాజుని ప్రశ్నిస్తే, ‘నాకు గ్లామరెక్కువ.. అందుకే నా గురించి ఇలాంటి దుష్ప్రచారం..’ అనేశారాయన.
మధ్యలో ఈ గ్లామర్ పిచ్చి ఏంటి.? ‘మీరు సినిమాల్లో హీరోగా ట్రై చేయొచ్చు కదా..’ అని మతిలేకుండా కొందరు మీడియా ప్రతినిథులు అడిగుతుంటారు.
Also Read: Pooja Hegde.. పూజా.. సల్మాన్‌తో బ్యాండ్ బాజా.?
సో, తన గ్లామర్ గురించి దిల్ రాజు ‘అత్యుత్సాహం’తో ఇలా తయారయ్యారేమో అన్న అనుమానం కలుగుతోందా.? అయితే అది మీ తప్పు కానే కాదు.
చివరగా.. ‘దిల్’ రాజు తెలుగునాట ఎలాగైతే కొందర్ని కష్టాలు పెడుతున్నారో, అలాంటి కష్టాలు ఆయనకే తమిళనాడులో ఎదురవుతున్నాయని అనుకోవచ్చా.?
అన్నట్టు, అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో.. అని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయ్.
‘ఎక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నావ్.? ఇద్దరు ప్రముఖ తమిళ హీరోల మధ్య గొడవ పెడ్తావా.?’ అంటూ ‘దిల్’ రాజుపై తమిళ తంబిలు మండిపడుతున్నారు.