Dil Raju Snacks Ban.. ఓ రెండు వెబ్ సైట్ల మీద ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు గుస్సా అయ్యాడు.! వాటిల్లో, ‘దిల్’ రాజు మీద ‘గాలి’ వార్తలు వచ్చాయట.!
సంక్రాంతి అంటే ‘దిల్’ రాజు, ‘దిల్’ రాజు అంటే సంక్రాంతి.! సంక్రాంతికి ‘దిల్’ రాజు నిర్మించే సినిమాలో, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన విడుదల చేసే సినిమాలో ప్రేక్షకుల ముందుకొస్తాయ్.! ఇది అందరికీ తెలుసు.
ఎలాగోలా సంక్రాంతిని ‘ఆక్యుపై’ చేసెయ్యడం ‘దిల్’ రాజుకి అలవాటు. తన సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుని, వేరే సినిమాలకు థియేటర్లు లేకుండా చేస్తాడన్నది ‘దిల్’ రాజు మీదున్న విమర్శ.
ఈ సంక్రాంతికీ అంతే..
‘గుంటూరు కారం’ సహా ‘సైంధవ్’, ‘నా సామి రంగ’, ‘హనుమాన్’ సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిల్లో ‘గుంటూరు కారం’ విడుదల చేస్తున్నాడు ‘దిల్’ రాజు.
దాంతో, మిగతా సినిమాలకు థియేటర్లు దొరకడంలేదు. ‘హనుమాన్’ టీమ్ అయితే, లిటరల్‌గా ఏడుస్తోంది పరిస్థితిని చూసి.
‘సైంధవ్’ సినిమా విషయమై విక్టరీ వెంకటేష్ కూడా ఒకింత అసహనంతో వున్నాడు. అక్కినేని నాగార్జున మాత్రం, తనకంటూ సేఫ్‌గా అవసరమైన థియేటర్లు బ్లాక్ చేసుకుని వున్నాడు.
Dil Raju Snacks Ban.. డబ్బింగ్ సినిమా సంగతేంటి.?
‘అయలాన్’ అనే తమిళ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతోంది. సంక్రాంతికే ఇది తెలుగులోనూ విడుదలవ్వాలి. అయితే, చివరి నిమిషంలో ‘దిల్’ రాజు దాన్ని వెనక్కి నెట్టాడట.
ఈ విషయమై ‘దిల్’ రాజు మీద రకరకాల గాసిప్స్ వచ్చాయ్. ఆ గాసిప్స్‌కి భయపడి దిల్ రాజు వెనక్కి తగ్గాడన్నది ఓ వాదన.
‘ఆ సినిమాని వెనక్కి నెట్టిందే నేను. దాన్ని తీసుకొస్తున్నానని ఎవడు చెప్పాడురా మీకు.?’ అంటూ ‘దిల్’ రాజు, ఓ సినీ వేడుకలో అసహనం వ్యక్తం చేశాడు.
Also Read: ఇంకా అక్కడే వుండిపోయినవ్.! ఎవరో నువ్వెవరో.!
ఇప్పటిదాకా ఊరుకున్నా.. ఇకపై తాట తీస్తా.. అంటూ హెచ్చించేశాడు.! తాట తియ్యడం కాదు, బహుశా ‘దిల్’ రాజు తన సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్‌కి వచ్చే సినీ మీడియాకి స్నాక్స్ పెట్టడం మానేస్తాడేమోనని సెటైర్లు పడుతున్నాయ్.
గాలి పోగెయ్యడం సినీ మీడియాకి మామూలే.! దాన్ని పెంచి పోషించడమూ సినీ ప్రముఖులకి మామూలే.!
ఏదీ, దిల్ రాజుకి అంత దమ్ము నిజంగానే వుంటే.. ఆ రెండు వెబ్ సైట్లనీ బ్యాన్ చెయ్యమను చూద్దాం.? అంత దమ్ము దిల్ రాజుకి లేదు.! అందుకే, వాళ్ళెలాగూ ఈ గాలి పోగెయ్యడం మానరు.!