Dimple Hayathi Rama Banam.. తెరపై ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించలేదా.? వల్గారిటీ ప్రదర్శించలేదా.? ‘వల్గారిటీ’ అంటే అంత కోపమెందుకొచ్చిందో.!
ఇక్కడేమో సందర్భం వేరు.! ప్రశ్నలో తప్పు లేదు, సమయం.. సందర్భమే తేడా కొట్టిందంతే. దాంతో, పాపకి కాస్త కోపమొచ్చింది. కానీ, సంయమనంతోనే సమాధానమిచ్చింది.
తెలుగమ్మాయ్ డింపుల్ హయాతీ (Dimple Hayathi) ఆ మధ్య ‘ఖిలాడీ’ అనే సినిమాలో నటించింది. రవితేజ హీరోగా నటించిన సినిమా అది.

అంతకు ముందు ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘సూపర్ హిట్టు..’ అంటూ స్పెషల్ సాంగ్ చేసింది డింపుల్ హయాతీ. ఆ స్పెషల్ సాంగ్ అయినా, ‘ఖిలాడీ’ సినిమాలో బికినీ గ్లామర్ అయినా.. అవన్నీ ఇంటర్నెట్‌లో వున్నాయ్ కదా.?
Dimple Hayathi Rama Banam.. రామబాణం.. సంగతి వేరు..
గోపీచంద్ సరసన ‘రామబాణం’ సినిమాలో నటిస్తోంది డింపుల్ హయాతీ. ‘వల్గర్‌గా కనిపిస్తున్నారు కదా..’ అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నించాడు డింపుల్ హయాతీని ‘రామబాణం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా.
‘పద్ధతిగానే వున్నాను కదా.. గ్లామర్ ఎక్కడుంది.?’ అని సమాధానమిచ్చింది డింపుల్ హయాతీ. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: Pooja Hegde.. ఎర్ర గులాబీలా మారిన ‘బుట్టబొమ్మ’.!
ఈ మధ్య ఇలాంటి ప్రశ్నలు సినీ పాత్రికేయుల నుంచి రావడం అనేది ట్రెండింగ్ అయి కూర్చుంది. ఇది కూడా ఓ పబ్లిసిటీ స్టంటే.
‘డీజే టిల్లు’ సినిమా ప్రమోషన్లలో ‘పుట్టుమచ్చలపై’ ఓ సినీ పాత్రికేయుడు సంధించిన ప్రశ్న ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. అది ఆ సినిమా పబ్లిసిటీకి బాగా పనికొచ్చింది.