Dimple Hayathi Sharwanand.. ఐటమ్ సాంగులూ చేసింది.. హీరోయిన్‌గానూ స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంది.!
అయినాగానీ, ఎందుకో హీరోయిన్‌గా తెలుగునాట స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయిందీ తెలుగమ్మాయ్.! ఆమె ఎవరో కాదు, డింపుల్ హయాతీ.!
మొన్నామధ్య ఓ వివాదంలో ఇరుక్కుని, కొంచెం గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే వుండే డింపుల్, అనూహ్యంగా సోషల్ మీడియా నుంచీ బ్రేక్ తీసుకుంది కొన్నాళ్ళపాటు.
Dimple Hayathi Sharwanand.. బాంబ్ ఈజ్ బ్యాక్..
రవితేజ, గోపీచంద్.. ఇలా స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసిన డింపుల్ హయాతీకి, ఫెయిల్యూర్స్ కారణంగా ఆ తర్వాత సరైన అవకాశాలు దక్కలేదన్నది నిర్వివాదాంశం.
ఎట్టకేలకు, డింపుల్ హయాతీ చేతికి ఓ మంచి ప్రాజెక్ట్ దక్కింది. అది కూడా శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడం గమనార్హం.

ఈ సినిమా కోసం ఆల్రెడీ అనుపమ పరమేశ్వరన్‌ని ఓ హీరోయిన్‌గా తీసుకున్నారు. డింపుల్ హయాతీ రోల్ ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఎలాంటి పాత్ర అయితేనేం, డింపుల్ హయాతీ మళ్ళీ వార్తల్లోకెక్కింది. ఈ క్రమంలోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయ్ డింపుల్ హయాతీ నుంచి.

చూస్తున్నారు కదా.. అందం, అభినయం.. అన్నీ వున్నా, అదేదో శని.. అన్న చందాన, టైమ్ బ్యాడ్ అంతే. ఆ టైమ్ కాస్త కలిసొస్తే, డింపుల్ హయాతీ దశ మారిపోతుందంతే.
Also Read: A అంటే Arjun Sarkar: ఏంటి నానీ మరీనూ.!
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో డింపుల్ హయాతీ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.