కత్తి మహేష్.. చాలామందికి పరిచయం అక్కర్లేని పేరిది తెలుగు రాష్ట్రాల్లో. ఓ వైపు సినిమా సంబంధిత వార్తల్లోనూ, ఇంకో వైపు రాజకీయ సంబంధిత వార్తల్లోనూ కత్తి మహేష్ పేరు ప్రముఖంగానే వినిపించేది. ఇప్పుడా కత్తి మహేష్ (Dirty Politics Around Kathi Mahesh) జీవించి లేడు. రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి, కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
సినీ నటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు.. అంతే కాదు, రాజకీయ పరమైన చర్చా కార్యక్రమాల్లోనూ విశ్లేషకుడిగా ముద్ర వేయించేసుకున్నోడు కత్తి మహేష్. నిజానికి, ఆయన్ని చాలామంది వాడేశారు. అలా వాడేసుకున్నవారిలో కొందరు, ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన వైద్య చికిత్స కోసం కొంత మొత్తాన్ని కేటాయించారు కూడా. పార్టీ పరంగా ఇవ్వాల్సిన సొమ్ములవి.
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
డబ్బు అనేది వేరే చర్చ. అసలు కత్తి మహేష్.. అనే పేరుని విచ్చలవిడిగా వాడేసుకున్న తెలుగు మీడియాలో కొన్ని మీడియా సంస్థలు, కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వెళ్ళి ఎందుకు వాకబు చేయలేకపోయాయి.? రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా.. ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నాడని వైద్యులు వెల్లడించినప్పటికీ.. ఆయనెందుకు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు.? లాంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
కత్తి మహేష్ మరణం తర్వాత కూడా రాజకీయాలు ఆగలేదు. ఆయన ఆసుపత్రిలో వున్నప్పుడూ అదే రాజకీయ రచ్చ. పవన్ అభిమానులు, కత్తి మహేష్ పట్ల కనీసపాటి జాలి చూపించలేదంటే తెగులు మీడియా కారు కూతలు కూయడం మామూలే. ఈ తెగులు మీడియానే, కత్తి మీడియాపై పవన్ అభిమానుల దాడి.. అంటూ రచ్చ చేసింది.
Also Read: నాయకులంతా వాళ్ళే.. రాజకీయాల్లో ‘మంచి మార్పు’ వచ్చేదెలా.?
అలా కత్తి మహేష్ పేరుని విచ్చలవిడిగా వాడేసిన ఆ తెలుగు మీడియా సంస్థల పెద్దలూ, కత్తి మహేష్ ప్రాణా పాయంలో వున్నా, ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చలేదు, వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సాయమూ చేయలేదు. తెగులు మీడియా, తెగులు రాజకీయం ఇలాగే వుంటుంది మరి. అక్షర దోషం ఏమీ లేదు.. ఇది తెలుగు మీడియా కాదు, తెగులు మీడియా.. అలాగే తెగులు (Dirty Politics Around Kathi Mahesh) రాజకీయం.