Disaster Akhanda2 Thandavam Openings.. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు.. సీనియర్ హీరో.!
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి, నలుగురు సీనియర్ అగ్ర హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.! సక్సెస్, ఫెయిల్యూర్‌కి సంబంధం లేకుండా, అభిమానులు బాలయ్యని ఆరాధిస్తుంటారు.
ఫెయిల్ అయిన సినిమాల్ని కూడా సుదీర్ఘ కాలం థియేటర్లలో ఆడించే అభిమానులు నందమూరి బాలకృష్ణకే సొంతమన్నది నిర్వివాదాంశం.
కానీ, ‘అఖండ-2’ సినిమా విషయంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రీమియర్ షోలు సైతం వెలవెలబోయాయి.
Disaster Akhanda2 Thandavam Openings.. మార్నింగ్ షోస్ వెల వెల..
నేడు రిలీజ్, నిన్న ప్రీమియర్స్ పడ్డాయి.! ఈ రోజు ఉదయం నుంచీ.. అంటే, ఎర్లీ మార్నింగ్ షోస్ దగ్గర్నుంచి, రెగ్యులర్ మార్నింగ్ షోస్ వరకు, ‘ఫుల్స్’ పడటం లేదు.!
అడ్వాన్స్ బుకింగ్స్ డల్‌గా వున్నా, కౌంటర్ వద్ద టిక్కెట్లు తెగుతాయని బాలయ్య అభిమానులు నిన్నటి నుంచీ ఊదరగొట్టేస్తూ వచ్చారు.
అయితే, థియేటర్ల వద్ద పరిస్థితి దారుణంగా వుంది. రిలీజ్ రోజున, చాలా థియేటర్లలో 50 శాతం టిక్కెట్లు కూడా తెగకపోవడం, బాలయ్య అభిమానులకి అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు.
సినిమాని థియేటర్లకి వచ్చి చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నమాట వాస్తవం. రెండో రోజుకే ఎంత పెద్ద సినిమా అయినా, ఖాళీ అయిపోతోంది.
కానీ, సినిమా విడుదల రోజున.. అది కూడా మార్నింగ్ షోస్ సైతం ఫుల్ కాకపోవడమంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.!
ఎక్కడ తేడా జరిగింది.? ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. నందమూరి బాలకృష్ణ అభిమానులూ, ఫుల్స్ చేయడానికి నానా తంటాలూ పడ్డారు.!
ఇంతటి డిజాస్ట్రస్ రిజల్ట్‌కి కారణమేంటి.? ప్రీమియర్స్ వల్లే, సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యిందా.? అంటే, పెద్ద సినిమాలకు ఈ తరహా నెగెటివిటీ కొత్తేమీ కాదు.
కారణం ఏమై వుంటుందబ్బా.? సాయంత్రానికి ‘అఖండ-2’ సంగతేంటో పూర్తిగా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. నిజానికి, కొత్తగా క్లారిటీ రావాల్సిందేమీ లేదు. ఆల్రెడీ రిజల్ట్ డిసైడ్ అయిపోయింది.
