Disaster Waltair Veerayya.. మీకు తెలుసా.? ‘వాల్తేరు వీరయ్య’ డిజాస్టర్ సినిమా.! ఔనండీ, నిజ్జంగా నిజం.! ఆ యాక్టింగ్ ఏంటీ, కామెడీ కాకపోతే.!
చిరంజీవి వయసేంటి.? ఆయన వేసే చిల్లరి వేషాలేంటి.? ఇది అసలు చిరంజీవి సినిమానే కాదు, రవితేజ సినిమా.!
ఆరు పదుల వయసు దాటి, ఏడు పదుల వయసులోకి వెళుతున్న చిరంజీవి, హీరోయిన్‌తో రొమాంటిక్ ట్రాక్ నడపడమేంటి.?
వాట్ నాట్.! ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చాక, ఆ సినిమాపై కనిపించిన నెగెటివిటీ అంతా ఇంతా కాదు. నిజానికి, సినిమా రిలీజ్‌కి ముందు నుంచే నెగెటివిటీ తారాస్థాయికి చేరింది.
రివ్యూలు డిజాస్టర్.. సినిమా సూపర్ హిట్.!
దాదాపుగా అన్ని రివ్యూలూ సినిమాని డిజాస్టర్ అని తేల్చేశాయి. ‘వాల్తేరు వీరయ్య’ కంటే, ‘ఆచార్య’ బెటర్ అంటూ కొన్ని రివ్యూల్లో వెటకారాలు చేశారు.
కానీ, రివ్యూలే డిజాస్టర్ అని తేలిపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ బంపర్ విక్టరీ అందుకుంది. ఎక్కడా.. ఏ రివ్యూలోనూ ఐదు పాయింట్లకు మూడు పాయింట్లు రాలేదు ‘వాల్తేరు వీరయ్య’కి.

కానీ, ‘వాల్తేరు వీరయ్య’ చాలా వేగంగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. 150 కోట్లు కూడా కొల్లగొట్టేసింది. 200 కోట్ల వసూళ్ళ వైపు పరుగులు పెడుతోంది.
Disaster Waltair Veerayya.. ఐదు సినిమాలు.. తేడా కొట్టింది ఒక్కటే.!
రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల సినిమాల్ని వదిలేసుకున్న చిరంజీవి, రాజకీయాల్ని వదిలేసి.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తం ఐదు సినిమాలు చేశారు.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్ చిరంజీవి ‘టూ పాయింట్ ఓ’.!
రీ-ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ సూపర్ హిట్. ‘సైరా నరసింహా రెడ్డి’ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అదొక దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. కమర్షియల్ లెక్కల గురించి మాట్లాడలేం.
‘ఆచార్య’ మాత్రం డిజాస్టర్. ‘గాడ్ ఫాదర్’ సినిమాతో చిరంజీవి మళ్ళీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’.. మళ్ళీ బంపర్ హిట్.!
చెత్త రివ్యూలతో సినిమాల్ని చంపెయ్యడమే పనిగా పెట్టుకున్నవారికి ‘వాల్తేరు వీరయ్య’ ఫలితం ఓ చెంప దెబ్బ.! ఎనీ డౌట్స్.!