బిగ్ హౌస్‌లో గ్లామరస్ బ్యూటీస్ విషయానికి వస్తే, ‘దివి’ చాలా చాలా స్పెషల్ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏ విషయాన్నయినా కుండబద్దలుగొట్టేస్తుంది. టాస్క్‌ల విషయంలో కన్సిస్టెన్సీని మెయిన్‌టెయిన్ చేస్తోంది. హౌస్‌లో యాక్టివ్‌గా వుంటూనే, రిజర్వ్డ్గా (Divi Vadthya Alekhya Harika) వ్యవహరిస్తుంటుంది.
ఇక, అలేఖ్య హారిక సంగతే సరి. ‘డేత్తడి’ హారిక.. పేరులోనే వుందా జోష్. ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అవుతోంది. ఇక, ఈ ఇద్దరికీ తాజా వీకెండ్ ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్‌లు తెలిసొచ్చాయి. రోబోట్స్ అండ్ హ్యామన్స్ టాస్క్‌కి సంబంధించి రోబోట్స్ బృందం హౌస్‌లో ఎలాంటి స్కెచ్ వేసిందో హోస్ట్ నాగ్ డీటెయిల్డ్‌గా చెప్పేసరికి అవాక్కయ్యింది దివి.
అబిజీత్‌ని అమాయకుడనుకున్నా.. కానే కాదు.. అని స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది దివికి. మరోపక్క, అలేఖ్య పరువు బజార్న పడేసింది గంగవ్వ. బ్రష్ చేయకుండానే నీళ్ళు తాగేస్తుందంటూ ‘బ్యాడ్ హ్యాబిట్’ని బయటపెట్టేసరికి అలేఖ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
‘బ్రష్ చేసుకుని, వేడి నీళ్ళు తాగేదాకా కాఫీ కూడా టచ్ చేయను’ అని అలేఖ్య వివరణ ఇచ్చుకున్నా, గంగవ్వ స్టేట్మెంటే ఎక్కువగా జనంలోకి వెళ్ళిపోయింది. అన్నట్టు, అలేఖ్య ఈ వీకెండ్ ఎపిసోడ్లో (శనివారం ఎపిసోడ్లో) బుట్టబొమ్మలా దర్శనమిచ్చింది.
పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్న మాట పెర్ఫెక్ట్గా సూటయిపోతుంది అలేఖ్యకి. దివి విషయానికొస్తే, ఏ విషయాన్ని అయినా కుండబద్దలుగొట్టేయడం ఆమెకు అలవాటు. అదే ఆమెకు ప్లస్‌పాయింట్ అవుతోంది కూడా. బిగ్ హౌస్‌లో విమెన్ కంటెస్టెంట్స్ విషయానికొస్తే దివి, అలేఖ్య.. ఒకర్ని మించి ఇంకొకరు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇద్దరూ హౌస్‌లో మంచి ఫ్రెండ్స్ కూడా.