‘డ్రగ్స్ బానిస’ (Drugs And Celebrities) అనే ట్యాగ్ ఒకప్పుడు చాలా చాలా దారుణమైనది. డ్రగ్స్ కేసులో దొరికితే అంతే సంగతులు. దొరకడం సంగతి తర్వాత.. ఆరోపణలు వస్తేనే, సగం జీవితం నాశనమైనట్లు. ట్రెండ్ మారింది. మత్తులో జోగడం, డ్రగ్స్‌కి బానిసలవడం హీరోయిజంలా తగలడింది.
పెద్ద పెద్దోళ్ల పార్టీలంటే, ఆ ‘మత్తు’ ఉండాల్సిందే. ఖరీదైన లిక్కర్ అనేది పాత మాట. ఖరీదైన డ్రగ్స్ కొత్త మాట. ఎవరు, ఎంత ఖరీదైన డ్రగ్స్ అందివ్వగలిగితే, అది అంత పెద్ద పార్టీ అని ఆ వ్యక్తి అంత గొప్పోడనీ, పెద్దోళ్ల పార్టీల్లో చర్చ జరుగుతుంటుందట. ఇది ఉత్త ‘అట’ కాదు. ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్ కేసుల్లో తేలుతున్న నిజమిది.
డ్రగ్స్ పాపం ఎవరిది.?
దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు గత కొంత కాలంగా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ, చాప కింద నీరులా డ్రగ్స్ మహమ్మారి చాలా జీవితాల్ని నాశనం చేసేస్తోంది. టన్నుల కొద్దీ అత్యంత ఖరీదైన డ్రగ్స్ దేశంలోకి వచ్చేస్తున్నాయ్. ఎలా.? సరిహద్దుల్లో దొరుకుతున్నది, కస్టమ్స్ అధికారులకు వివిధ మార్గాల్లో చిక్కుతున్నదీ చాలా తక్కువ. దేశంలోకి వచ్చేస్తున్నదే చాలా ఎక్కువట.
Also Read: నిస్సిగ్గు రాజకీయం.. ఓ మై సన్.. మదర్స్ హజ్బెండ్..!
దేశంలో పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇక్కడి నుండే డ్రగ్స్ దందా ఎక్కువగా పాకుతోంది. ఈవెంట్లూ, పార్టీలు డ్రగ్స్ వాడకానికీ, అమ్మకానికీ కేంద్రాలుగా మారుతున్నాయి. బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ దాకా దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లోనూ డ్రగ్స్ కలకలం కనిపిస్తోంది. అరెస్టులు జరుగుతున్నాయ్. ప్రముఖుల పేర్లు, డ్రగ్ర్స్ కేసులకు సంబంధించి వార్తల్లోకెక్కుతున్నాయ్.
Drugs And Celebrities.. సెలబ్రిటీ డ్రగ్స్..
విచారణలే జరుగుతున్నాయ్, అరెస్టులే జరుగుతున్నాయ్. కానీ, దోషులకు శిక్ష పడడం లేదు. పడినా, చాలా చాలా ఆలస్యంగా జరుగుతోంది ఆ శిక్ష పడడం. దాంతో డ్రగ్స్ వాడితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ, శిక్షింపబడతామనే భయం ఎవరికీ లేకుండా పోయింది. అదే అసలు సమస్య.
Also Read: స్మార్ట్ హ్యాకింగ్.. మీ మొబైల్ ఫోన్ మీకు శతృవు ఐతే.!
సెలబ్రిటీలే కాదు, కాలేజీ విద్యార్ధులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులు కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారు. దేశం ఏమైపోతోంది.? ఎవ్వరూ నోరు మెదపరేం.? ఈ మహమ్మారికి (Drugs And Celebrities) అడ్డుకట్ట పడేదెలా.?