Dynamic Beauty Rukmini Vasanth.. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్.
అందంగా అమాయకత్వంగా కనిపించే రుక్మిణీ వసంత్.. ఆ తర్వాత తనలోని నటికి సవాల్ విసిరే పాత్రల కోసం సెర్చింగ్ మొదలుపెట్టింది.
తొలుత ఇన్నోసెంట్ రోల్స్‌నే ఎంచుకున్న రుక్మిణీ వసంత్‌కి ‘కాంతార’ ఓ డిఫరెంట్ బ్రేక్ అని చెప్పొచ్చు. నెగిటివ్ షేడ్స్ వున్న రోల్లో కనిపించి షాక్ ఇచ్చింది ఈ సినిమాలో రుక్మిణీ వసంత్.
ప్రస్తుతం తెలుగులో ఎన్టీయార్ హీరోగా రూపొందుతోన్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రుక్మిణీ వసంత్. అలాగే కొన్ని మలయాళ, తమిళ ప్రాజెక్టులు కూడా చర్చల దశలో వున్నాయ్.
అన్నట్లు సీనియర్ నటి మాలాశ్రీతో కలిసి ‘మంగళగౌరి’ అనే ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ వున్న సినిమాలో నటిస్తోంది రుక్మిణీ వసంత్.
Dynamic Beauty Rukmini Vasanth.. స్టైలింగ్ విత్ ఇన్నోసెన్స్.!
తన ఇన్నోసెంట్ లుక్స్‌తో పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నరుక్మిణీ వసంత్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామరస్ అప్పీల్తోనూ మెరిసిపోతుంటుంది.
తాజాగా అలాంటివే కొన్ని లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయ్. బ్రైట్ ఎల్లో – మస్టర్డ్ షేడ్ షిమ్మర్ క్రాప్ టాప్ ధరించి రుక్మిణీ వసంత్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

హైనెక్ ప్లీటెడ్ డిజైన్ ఈ టాప్‌కి సరికొత్త అప్పీల్ ఇస్తోంది. కోల్డ్ షోల్డర్ కట్స్ వున్న లూజ్ స్లీవ్స్ ఈ డ్రస్‌కి మంచి ఫ్లోయింగ్ లుక్ ఇచ్చాయ్. అలాగే డార్క్ బ్లాక్ ట్రౌజర్స్ బోటమ్ సూపర్బ్ కాంబినేషన్.
ఈ కాంబో డ్రస్‌కి రుక్మిణి సెట్ చేసుకున్న లూజ్ ఫాలింగ్ హెయిర్ స్టైల్ ఆమె లుక్స్‌ని మరింత బ్రైట్ చేస్తోంది. అన్నింటికీ మించి ఆమె ముఖంలోని చిరునవ్వు.
ఆ నవ్వుకు నవరత్నాలే రాలాలా.! నెలవంకే కిందికి దూకాలా.! అన్నట్లుగా వెల కట్టలేని ఎక్స్ట్రా మేకప్‌ని ఆమె ముఖానికి యాడ్ చేసి, రిలాక్స్ వైబ్ ఇస్తోంది.
అన్నట్టు, అందం, అభినయమే కాదు.. జుగుప్సాకరమైన ట్రోలింగ్ సోషల్ మీడియా వేదికగా జరిగినప్పుడు, తనదైన స్టయిల్లో ఖండించే డైనమిజం రుక్మిణి సొంతం.