Table of Contents
Tanushree Dutta Nana Patekar Row.. పెద్దలు చెబుతుంటారు, పోయినోళ్ళంతా మంచోళ్ళనని.!
చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా ఏం మాట్లాడగలం.? మాట్లాడి ఏం ప్రయోజనం.? ఇదొక సానుకూల దృక్పథం.!
కానీ, పోయినోళ్ళంతా మంచోళ్ళే కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పోయినోళ్ళు చేసిన చెడు గురించి చరిత్ర ఖచ్చితంగా మాట్లాడుకుంటుంది. మాట్లాడుకోవాలి కూడా.!
ఇప్పడిక్కడ మనం చర్చించుకుంటున్నది ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ గురించి. ఇటీవల ఆయన అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే.
గోవాలోని తన ఇంట్లో మృతిచెందారు నానా పటేకర్. వృద్ధాప్య సమస్యల కారణంగా చనిపోయారా.? గుండె పోటు వల్ల చనిపోయారా.? అన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారంటూ వార్తలొస్తుననాయ్. అది వేరే చర్చ.
హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ నానా పటేకర్..
భారతీయ సినీ తెరపై నానా పటేర్కి వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. సినీ నటుడిగా, తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నాడాయన.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నానా పటేకర్, బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారన్నది అందరికీ తెలిసిన విషయమే.
చాలా మంచోడు.. కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా పని చేశాడు. చాలామందికి చాలా చాలా సాయాలు చేశాడు.. ఇలా, నానా పటేకర్ గురించి ‘మంచి మాటలు’ చాలానే వున్నాం.
అదే సమయంలో, నానా పటేకర్ని ‘విమెనైజర్’ అనగా, స్త్రీలోలుడు.. అని కూడా విన్నాం. సినీ నటి తనూశ్రీ దత్తాని లైంగికంగా వేధించాడు నానా పటేకర్.. అన్నది ప్రధాన ఆరోపణ.
Tanushree Dutta Nana Patekar Row.. ఏళ్ళ తరబడి నానా పటేకర్పై న్యాయ పోరాటం..
ఈ విషయమై చాలా ఏళ్ళుగా తనూశ్రీ దత్తా న్యాయపోరాటం చేస్తూనే వుంది. అయితే, ఆమె ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
నానా పటేకర్ చనిపోయాక, ఆనందం వ్యక్తం చేసింది తనూశ్రీ దత్తా. దాంతో, తనూశ్రీ దత్తాని చాలామంది ట్రోల్ చేశారు. తనూశ్రీ దత్తా మాత్రం, ‘పోయినోళ్ళంతా మంచోళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు’ అని తేల్చేసింది.
‘నేను ఆ మానవ మృగం వల్ల పడ్డ ఇబ్బందులు నాకు మాత్రమే తెలుసు.. నానా పటేకర్ చనిపోయినా, అతన్ని నేను క్షమించను’ అంటూ తెగేసి చెప్పింది తనూశ్రీ దత్తా.
అసలు, తనూశ్రీ దత్తా చెప్పింది నిజమేనా.? అంటే, నిజమేనేమో.! నిజం కాకపోవచ్చునేమో.! ఆవేదన అనుభవించింది తనూశ్రీ దత్తా గనుక.. ఆమె అభిప్రాయాన్ని మనం తప్పుపట్టలేం.
చనిపోయినా.. వదిలే ప్రసక్తే లేదు..
‘చనిపోయాడు కదా.. వదిలెయ్..’ అంటూ, తనూశ్రీ దత్తాకి చాలామంది చాలా రకాల సూచనలు చేస్తున్నారు. కానీ, తనూశ్రీ దత్తా మాత్రం, నానా పటేకర్ని క్షమించే ప్రసక్తే లేదంటోంది.
ఏతావాతా చెప్పేదేంటంటే, తనూశ్రీ దత్తా దృష్టిలో నానా పటేకర్ అంటే, ఓ మానవ మృగం.! ఇదింతే, ఇదెప్పటికీ మారదంతే.! సో, పోయినోళ్ళంతా మంచోళ్ళే కావాల్సిన అవసరం లేదన్నమాట.
కానీ, తనూశ్రీ దత్తా చేస్తున్న ‘లైంగి వేధింపుల’ ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవడానికి నానా పటేకర్ ప్రస్తుతం జీవించి లేడు. ఈ నేపథ్యంలో తనూశ్రీ దత్తా ఆరోపణల పర్వం ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో ఏమో.!
తనూశ్రీ దత్తా ఆశిస్తున్నట్లుగా నానా పటేకర్ తప్పు చేశాడని సమీప భవిష్యత్తులో తేలినా, ఆయన శిక్ష అనుభవించే అవకాశమైతే లేదు.
అన్నట్టు, నానా పటేకర్ ఆల్రెడీ న్యాయస్థానం నుంచి క్లీన్ చిట్ పొందాడు.. లైంగిక ఆరోపణలకు సంబంధించి, ఆధారాలేవీ లేకపోవడంతో.