ఫస్ట్ వీక్ హేమ (Hema) ఎలిమినేట్ అవుతుందని ముందే ఎలా అందరికీ (Bigg Boss Telugu Script) తెలిసిపోయింది.?
రెండో వీక్ ఎలిమినేషన్ జాఫర్‌దేననే (Jaffar) ‘లీక్’ బయటకు ఎలా వచ్చింది.?
మూడో వీక్ తమన్నా సింహాద్రి (Tamanna Simhadri) ఎలిమినేట్ అయిపోవడం ఖాయమని ఎలా జనం ముందే ఫిక్సయిపోయారు.?
బిగ్‌బాస్ రియాల్టీ షో (Bigg Boss Telugu Script) చుట్టూ చాలా అనుమానాలున్నాయి. ఇదంతా స్క్రిప్టింగ్ వ్యవహారమేనని ప్రచారం జరుగుతోంది. ‘స్క్రిప్ట్ అన్న మాటకే ఆస్కారం లేదు’ రెండో వీక్ ఎలిమినేట్ అయిన జాఫర్ కుండబద్దలుగొట్టేశాడు. ఓ జర్నలిస్ట్‌గా తాను ఈ నిజం చెబుతున్నానంటూ జాఫర్ ఒకింత ఆవేశానికి లోనయ్యాడు. తాజాగా, ఇదే మాట తమన్నా సింహాద్రి కూడా చెప్పింది. అసలేం జరుగుతోంది బిగ్ బాస్‌లో. ఇదంతా స్క్రిప్టెడ్ వ్యవహారమేనా.? కాదా.?
బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది హేమ.. అంటూ షో ప్రారంభానికి ముందే చాలామంది తేల్చేశారు. అప్పటికి ఆమె కంటెస్టెంట్‌గా ఎంపికయ్యిందన్న అధికారిక ప్రకటన కూడా రాలేదు.
తమన్నా సింహాద్రిని (Tamanna Simhadri) తొలుత ఎంపిక చేసుకున్నారనీ, అయితే సర్‌ప్రైజ్ ఇచ్చే క్రమంలో హేమని తీసుకొచ్చి, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హేమని పంపించేసి, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నాని తీసుకొస్తారనీ ముందే ఎలా అన్ని విషయాలూ బయటకొచ్చేస్తున్నాయో ఏమో.! బహుశా ఇదంతా బిగ్‌బాస్ కోసం పనిచేస్తున్నవారెవరో బయటకు లీకులుగా ఇచ్చేస్తున్న సమాచారం అని అనుకోవాల్సిందే.
ఇక, స్క్రిప్టెడ్ వ్యవహారం గురించి పదే పదే ప్రస్తావన వస్తుండడంతో, అనుమానాలు ఆటోమేటిక్‌గా బలపడిపోతుంటాయి. చిన్న చిన్న విషయాలకే కంటెస్టెంట్స్ వైల్డ్‌గా రియాక్ట్ అయిపోతుంటారు. అది మనకి నాటకీయంగా కన్పించడం సహజమే. ఎందుకంటే, 24 గంటల వ్యవధిలో జరిగే విషయాలకు సంబంధించి కేవలం మనకు చూపించేది గంట సమయం మాత్రమే. సో, మొత్తం వీడియోస్‌ని ఫిల్టర్ చేసి, జనరంజకంగా వుండేవి మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. అదీ అసలు సంగతి.
ఈ వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యింది. అయితే, ఆమె రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు చాలామంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు గతంలో వున్నాయి.
ప్రస్తుతానికైతే హౌస్‌లో వాతావరణం తమన్నా ఎలిమినేషన్‌తో (Bigg Boss Telugu Script) కొంత చల్లబడింది. కానీ, సభ్యుల మధ్య అంతర్గతంగా కెమికల్ రియాక్షన్స్ చాలా వైల్డ్‌గా మారుతున్నాయి. ఇకపై హౌస్‌లో వాతావరణం ఎన్నడూ లేనంత హాట్‌గా వుండబోతోందన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయాల సారాంశం.
ఏదిఏమైనా, ‘స్రిప్ట్’ ఆరోపణలు గట్టిగా విన్పిస్తున్న దరిమిలా, ఆ ప్రస్తావన రాకుండా హోస్ట్ నాగార్జున చూసుకోవడం మంచిది. ఎందుకంటే, పదే పదే వివరణ ఇస్తూ పోతోంటే ‘భుజాలు తడుముకున్నట్లు’ వుంటుందేమో.!