Engineering Artificial Intelligence CSE.. ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మేనియా నడుస్తోంది ఇంజనీరింగ్ విద్యలో.!
మెజార్టీ ఇంజనీరింగ్ కాలేజీలు, ఏఐ ఎంఎల్, డేటా సైన్స్.. తదితర విభాగాలు తప్ప, ఇతర విభాగాలేవీ వద్దంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం.
కంప్యూటర్ సైన్స్.. ఓన్లీ సీఎస్ఈ.! ఇదీ లేటెస్ట్ ట్రెండ్.! అది తప్ప, ఇంకేది చదివినా వేస్ట్.. అంటూ, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాయి కూడా.
Engineering Artificial Intelligence CSE:భవిష్యత్తు భయానకం..
భవిష్యత్తులో కోడింగ్ అవసరం వుండదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ మాత్రమే నడుస్తాయ్.! మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ విభాాగాలకీ మంచి డిమాండ్ వుంటుందంటున్నారు.
ఇది కొంత నిజమే కావొచ్చు. రోజుకో కొత్త యాప్ పుట్టుకొస్తోంది. ఆయా యాప్స్ తెస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోజుకో కొత్త ‘వింత’ని పరిచయం చేస్తోంది.

సో, ముందు ముందు లైఫ్ చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఈజీ అయిపోతోందంటే, చాలా చాలా కాంప్లికేట్ అయిపోనుందన్నమాట. ఔను, దానికీ దీనికీ లింక్ వుంది మరి.
లక్షల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు బయటకు వస్తోంటే.. దానికి తగ్గట్టుగా అవకాశాలు కూడా ఈ రంగంలో వుండాలి కదా.? ప్చ్.. వుండటం లేదు.
ఏఐ, ఎంఎల్.. వీటి పుణ్యమా అని, వంద మంది చేయాల్సిన పని.. ఒకరిద్దరితో అయిపోతోందాయె.! ఆ లెక్కన, కొత్తగా పుట్టుకొచ్చే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ల భవిష్యత్తు ఏంటి.?
ఎవరెలా పోతే మనకేంటి.?
ఈ కోణంలో అస్సలెవరూ ఆలోచించడంలేదు. నిజానికి, మనిషి బతకాలంటే, మిగతా విభాగాల్లోనూ ఇంజనీరింగ్ నైపుణ్యం అవసరం.
సివిల్ ఇంజనీర్లు, కెమికల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు.. వీళ్ళు లేకపోతే, భవిష్యత్తుని ఊహించుకోగలమా.?
Also read: ఇంజనీరింగ్: సీఎస్ఈ మాత్రమే ఎందుకు.?
ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ.. వాట్ నాట్, అన్ని ఇంజనీరింగ్ విభాగాలూ మనిషి మనుగడకి అవసరమే. కానీ, వాటి పట్ల అవగాహన ఏదీ.? ఎక్కడ.?

ఇప్పటికైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.. అందునా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. మరి, దానికి డిమాండ్ పడిపోతేనో.?
మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదిది.! లక్షలాది మంది ఇంజనీర్లు రోడ్డున పడతారు.! ఇదైతే నూటికి నూరు పాళ్ళూ నిజం.!