Faria Abdullah Aa Okkati Adakku.. ‘జాతిరత్నాలు’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిందిగానీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకో విజయం ఆమెను ఇంతవరకు వరించింది లేదు.
ఈసారి మళ్ళీ హిట్టు కొడతానంటోంది ఆమె.! ఎవరో తెలుసు కదా.? ఫరియా అబ్దుల్లా.! తెలుగు సినీ పరిశ్రమలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఆమె.!
ఆగండాగండీ.. ఎందులో నంబర్ వన్.? ఇంకెందులో ‘హైట్’లో.! పొడగరి హీరోల గురించి చెప్పుకుంటాంగానీ, పొడుగ్గా వుండే హీరోయిన్ల గురించి అరుదుగా మాట్లాడుకుంటుంటాం.
Faria Abdullah Aa Okkati Adakku.. ప్రభాస్‌నే ఆశ్చర్యపరిచి..
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ‘డార్లింగ్’ ప్రభాస్ పొడగరి.! అలాంటి ప్రభాస్‌నే ఆశ్చర్యపరిచింది హైట్ విషయంలో ఫరియా అబ్దుల్లా.
తాజాగా, అల్లరి నరేష్ సరసన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.!
బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేసి, ఆ తర్వాత సీరియస్ మోడ్‌లోకి మారిన అల్లరి నరేష్, చాలా గ్యాప్ తర్వాత తన ట్రేడ్ మార్క్ కామెడీతో అలరించేందుకు ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తన తొలి సినిమా ‘జాతి రత్నాలు’ తరహాలో కాస్తంత కామెడీ పండిస్తూనే, ఒకింత హాట్ అప్పీల్ కూడా పండించబోతోందిట ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో ఫరియా అబ్దుల్లా.
టైటిల్ రివీల్ చేసే క్రమంలో, ‘అల్లరి నరేష్ (Allari Naresh) చెప్పొద్దన్నారు..’ అంటూ, పై ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read: Daksha Nagarkar: తొడల్ వడల్ ఆల్ సోషల్.! ఛల్ నికల్.!
టైటిల్ రివీల్ అయిపోయింది కదా.! ‘ఆ ఒక్కటీ అడక్కూడదు’ అంటే ఎలా.? అని ప్రశ్నిస్తున్నారు ఫరియా అబ్దుల్లాని.
‘పెళ్ళికాని ప్రసాద్’ కాన్సెప్ట్‌తో ఈ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా తెరకెక్కుతోంది.