Fear Factor Media.. విన్నారా.! ఇది విన్నారా.! కొత్త వైరస్సు వచ్చేస్తోందట. కానీ, అది కొత్త వైరస్ కాదు. కాకపోతే, కొత్తగా రాబోతోందట. కుంభకర్ణుడిలా చాలా ఏళ్ళపాటు నిద్రపోయి, ఇప్పుడే నిద్ర లేచిందట.
కుంభకర్ణుడు తనంతట తాను నిద్రలోంచి లేవలేదు కదా.! లెగ్గొట్టారు.! ఈ వైరస్ కూడా అంతే. తన మానాన తాను నిద్రపోతోంటే, దాన్ని మేల్కొలిపారు శాస్త్రవేత్తలు.
అసలు ఎక్కడుందీ వైరస్.? దీని కథా కమామిషు ఏంటి.? ప్రపంచం ఈ వైరస్ దెబ్బకి చిగురుటాకులా వణికిపోనుందా.?
బాబోయ్.. మళ్ళీనా.?
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం విలవిల్లాడింది. ఇంకా ఆ ప్రకంపనలు కనిపిస్తూనే వున్నాయి. ఇంతలోనే, ‘జాంబీ వైరస్’ పేరుతో కొత్త వైరస్సు జాడ తెరపైకొచ్చింది.
ఐరోపా శాస్త్రవేత్తలు కొన్ని వేల ఏళ్ళుగా గడ్డకట్టుకుపోయి వున్న మంచు నుంచి కొన్ని వైరస్ నమూనాల్ని వెలికి తీశారట. వీటిని 13 రకాల సూక్ష్మ జీవులుగా వర్గీకరించారట.

దీనికో పేరు తగలడాలి కదా మరి.! జాంబీ వైరస్ అని పేరు పెట్టేశారు. వేల ఏళ్ళుగా మంచులో కప్పిపెట్టబడి వున్నగానీ, ఇంకో జీవికి సోకే స్థితిలోనే ఈ వైరస్ వుందని శాస్త్రవేత్తలు గుర్తించడం గమనార్హం.
ఈ వైరస్సుల్లో ‘పాండోరా వైరస్ ఎడోమా’గా పిలిచే ఓ సూక్ష్మజీవి ఏకంగా 48,500 ఏళ్ళ క్రితం నాటిదని నిర్ధారించారు. 2013లో ఇదే శాస్త్రవేత్తల బృందం కనుగొన్న ఓ వైరస్ 30 వేల ఏళ్ళనాటిదట.
Fear Factor Media.. హిమఖండాలు కరిగిపోతే.?
హిమఖండాలు ఎందుకు కరిగిపోతాయ్.? ఇంకెందుకు.. మనిషి కక్కుర్తి కారణంగానే. భూతాపం.. అన్ని అనర్ధాలకీ కారణం. భూమ్మీద మంచు కరుగుతూ పోతేంటే, ఆ వైరస్ బయటకు పూర్తిగా వచ్చేస్తుందట.
అప్పుడిక జంతువులు, మనుషులు, మొక్కలకు ఈ వైరస్ సోకితే.. అంతే సంగతులు.! ఆగండాగండీ.. ప్రస్తుతానికి ఇది పరిశోధన మాత్రమే. వున్నపళంగా భయపడాల్సిందేమీ లేదు.
Also Read: ఉద్యోగాలు పోతున్నయ్.! ‘సాఫ్ట్’గా పీకి పారేస్తున్నారంతే.!
అయినాగానీ, ఏమో ఎవడు గ్యారంటీ ఇవ్వగలడు.? కరోనా వైరస్ ఒకటి ప్రపంచాన్ని ఇంతలా భయపెడుతుందని ఎవరైనా ఊహించారా.?
మనిషికి మూడితో జాంబీ వైరస్ జెట్ స్పీడుతో వచ్చేసినా వచ్చేస్తుంది. ఎనీ డౌట్స్.?