Table of Contents
చిరుగాలిలా మొదలై బాక్సాఫీస్‌పై సునామీలా విరుచుకుపడ్డాడు విజయ్ దేవరకొండ. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఈ యంగ్ హీరో ఎదిగిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ ఘనతను ఫోర్బ్స్ గుర్తించింది. Vijay Deverakonda Forbes
ఓ సినిమా టైటిల్ విషయంలో వివాదం తలెత్తితే అది ఆ చిత్ర యూనిట్‌కి పెద్ద సంకటమే అవుతుంది. యంగ్ హీరో నిఖిల్ సమస్యల సుడిగుండం నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో తనదైన ముద్ర వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నిఖిల్ కొత్త సినిమా సంగతులివి.
‘మణికర్ణిక’ సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా వివాదాలు చల్లారటం లేదు. దర్శకుడు క్రిష్‌కీ, నటి కంగనా రనౌత్‌కీ మధ్య తలెత్తిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం ఎప్పటికి చల్లారేనో.!
యాంగ్రీ యంగ్‌మ్యాన్ కాస్తా యాంగ్రీ స్టార్‌గా మారాడు. తన కొత్త సినిమా కోసం రాజశేఖర్ ఇంకాస్త కొత్తగా ముస్తాబయ్యాడు. నేనింకా యంగ్‌మ్యాన్‌ని అంటారేంటీ. అని ప్రశ్నిస్తున్నాడీ యాంగ్రీ యంగ్‌స్టార్.
అందం, అభినయం, అదృష్టం అన్నీ ఉన్నా కెరీర్‌లో హిట్ సినిమాలున్నా హీరోయిన్ కేథరీన్‌ది ఒడుదుడుకుల ప్రయాణమే. ఈ భామ ఈ ఏడాదిలో పుంజుకుంటానంటోంది. అందుకు తగ్గట్లే అవకాశాలూ పోటెత్తుతున్నాయి.
టాలీవుడ్‌లో ఈ టాప్ 5 సంగతులు గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం పదండి.
30 – కొల్లగొట్టేసిన రౌడీ.! Vijay Deverakonda Forbes
30 ఏళ్లు వచ్చేసరికి ఆర్ధికంగా సెట్ అయిపోవాలని ఆయన తండ్రి సూచించారట. ఒకప్పటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ విజయ్ దేవరకొండ అప్పట్లో తన అకౌంట్లో 500 రూపాయలు కూడా లేని విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఇలా ఆనాటి విషయాల్ని విజయ్ ఎందుకు చెప్పాడంటే, ఫోర్బ్స్ తాజా లిస్టులో మనోడు చోటు దక్కించుకున్నాడు కనుక.
ముప్పై ఏళ్లలోపు వయసున్న ప్రముఖులు ఆయా రంగాల్లో సాధించిన విజయాల ఆధారంగా ఈ లిస్టు తయారైంది. టాలీవుడ్ నుండి విజయ్ దేవరకొండ టాప్ 30 లిస్టులో చోటు దక్కించుకున్నాడు. వరుస సినిమాలతో ఈ ఏడాది ఈ యంగ్ హీరో సందడి చేయబోతున్నాడు. నిర్మాతగా తన తొలి ప్రయత్నమూ ఈ ఏడాదే అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
‘అర్జున్ సురవరం’ ఘటికుడే.!
‘మిస్టర్ మజ్ను’తో పాటు ‘ముద్ర’ అనే సినిమా విడుదలైంది. అందులో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. కానీ నిఖిల్ సినిమా పోస్టర్లని ఉపయోగించి ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్లారు.
నిఖిల్ – లావణ్య జంటగా నటించిన సినిమాకి తొలుత ‘నిఖిల్ ముద్ర’ అనే టైటిల్ పెట్టారు. వివాదం నడిచింది. అటు వైపు నుండి దారుణంగా బెదిరింపులొచ్చాయి. వివాదంతో లాభం లేదనుకుని సింపుల్‌గా టైటిల్ మార్చేసుకున్నారు. అలా నిఖిల్ కొత్త సినిమా పేరు ‘అర్జున్ సురవరం’ అయ్యింది. ‘ముద్ర’తో పోల్చితే ‘అర్జున్ సురవరం’ చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తోంది.
క్రిష్ అంటే కంగనాకు అంత లోకువా.?
దర్శకుడంటే ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. కానీ ఇప్పుడా కెప్టెన్ పట్ల నటీనటులకెవరికీ కనీసపాటి గౌరవం లేదు. ‘మణికర్ణిక’ సినిమా క్రిష్ మానస పుత్రిక. కంగనా తెలివిగా క్రిష్‌ని పక్కకి తప్పించింది. కంగనా రనౌత్ గురించి తెలియనిదెవరికి.? అవసరం తీరాక క్రిష్‌ని బయటికి పంపేసి, తానే దర్శకత్వం చేశానని చెప్పి, జుగుప్సాకరమైన సాంప్రదాయానికి తెర లేపింది. దీన్ని క్రియేటివ్ దోపిడీ అనకుండా ఉండలేం కదా.
కంగనా అంత సమర్ధురాలే అయితే ‘మణికర్ణిక’ కోసం క్రిష్‌ని ఎందుకు తీసుకున్నట్లు.? క్రిష్ నుండి చాలా నేర్చుకున్నానని గతంలో చెప్పిన కంగనా, అసలిప్పుడు క్రిష్‌కి ఏమీ రాదని చెప్పడం అభ్యంతరకరం. ఇలాంటి అవమానం బాలీవుడ్‌లో ఏ ప్రముఖ దర్శకుడికైనా జరిగితే పరిస్థితి ఎలా ఉండేదో.? తెలుగు దర్శకుడు కదా అక్కడ ఆ మాత్రం చులకన తప్పదేమో.
కల్కి అలా – కేథరీన్ ఇలా.!
‘కల్కి’ సినిమా టీజర్ విడుదలైంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్‌ని విడుదల చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాజశేఖర్ గెటప్, పిక్చరైజేషన్ అన్నీ అద్భుతంగా సెట్టయ్యాయ్. ఎంపిక చేసుకున్న కథల్ని మాత్రమే జాగ్రత్తగా చేస్తున్న రాజశేఖర్ ఈ సినిమాతో మరో విజయం సొంతం చేసుకుంటానంటున్నారు. ‘అ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించాడు. రొటీన్‌కి భిన్నంగా డిఫరెంట్ ప్యాటర్న్‌లో ఈ సినిమా ఉండబోతోంది. ఆదాశర్మ, నందితా శ్వేత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరోపక్క విజయ్‌దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో అందాల భామ కేథరీన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో సింగరేణి ఉద్యోగిగా విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda Forbes) కనిపించబోతున్నాడట. కేథరీన్ అంటే ‘అందాల ఎమ్మెల్యే (మై లవ్‌లీ ఏంజెల్) ఈ సినిమాతో సందడి చేయబోతోంది.