Free Hindu Temple.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నారా.? మీకేమీ రాయితీలు లభించవు.!
పైగా, వేగంగా దర్శనమైపోవాలంటే మాత్రం, బోల్డంత ఖర్చు చెయ్యాలి.! దీన్ని ‘భక్తి పన్ను’గా భావించాలేమో.!
అదే, ఇతర మతస్థులకు ఈ తరహా ఇబ్బందులుండవు. వారి వారి పవిత్ర స్థలాలకు (విదేశాల్లోనే వున్నాయ్ ప్రముఖమైనవి) ప్రత్యేక రాయితీలు ఇస్తుంటాయి ప్రభుత్వాలు.!
Free Hindu Temple.. ఫ్రీ హిందూ టెంపుల్.. ఎందుకు.?
దేశవ్యాప్తంగా ‘ఫ్రీ హిందూ టెంపుల్’ (Hindu Temple) అనే నినాదం చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.!
అసలు, దేవాలయానికి (Hindu Temples) వెళ్ళేటప్పుడు, టిక్కెట్ ఎందుకు కొనుగోలు చేయాలి.? భక్తులందు వీఐపీ భక్తులు వేరయా.. అని ఎందుకు నిబంధనలు పెడుతున్నారు.?

దేవుడి ముందర భక్తులంతా ఒక్కటే.! ఎవరూ వీఐపీలు కాదక్కడ.! కానీ, అధికారంలో వున్నోళ్ళు అడ్డగోలుగా దర్శనాలకు వెళుతున్నారు.. ‘వీఐపీ’ ముసుగులో.
మంత్రి పదవుల కంటే కూడా, దేవాలయాల పాలక మండళ్ళలో చోటు కోసం ఎక్కువ రాజకీయ ప్రయత్నాలు జరుగుతాయంటే, అక్కడ లభించే ‘ఆదాయం’ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు.
ప్రసాదాల అమ్మకం..
ప్రసాదం ఫలానా బరువుతో లభిస్తుందంటూ వివరంగా పేర్కొంటూ అమ్మేస్తున్నారు.! అసలు ప్రసాదాల్ని అమ్ముకునే స్థాయికి ఎందుకు ‘హిందూ ధర్మాన్ని’ దిగజార్చేసినట్టు.?
దేవాలయాలకు పాలక మండళ్ళు అట. నవ్విసోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారు. లేకపోతే, దేవాలయానికి పాలకుడు దేవుడే అవుతాడు.!
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
క్షేత్ర పాలకులంటూ మళ్ళీ దేవుళ్ళనే పేర్కొంటుంటాం దేవాలయాలకు సంబంధించి. కానీ, ఈ పాలక మండళ్ళు వేరు. అవి, రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలు.!
అన్నట్టు, క్యూలైన్ల పేరుతో జైళ్ళలో ఖైదీల కంటే దారుణమైన పరిస్థితులు కల్పిస్తున్నారు కొన్ని దేవాలయాల్లో.
ఔను, దేవాలయాలకు విముక్తి కావాలిప్పుడు.! రాజకీయ పెత్తనం నుంచి విముక్తి కావాలి.! ప్రభుత్వాల నుంచి దేవాలయాలకి రక్షణ కావాలి.!

భక్తుడికేమో, దర్శనం టిక్కట్లు.. ప్రసాదాల అమ్మకం నుంచి విముక్తి కలగాల్సిందే.! కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? దేవాలయానికి అర్థం మార్చేసింది రాజకీయం.
దేవ ప్లస్ ఆదాయ.. అంటే, దేవుడి మీద ఆదాయం సంపాదించడం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇది వ్యాపారం కాక.. ఇంకేమిటి.?
హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు చేసే పార్టీలు అధికారంలో వున్నా, ‘ఫ్రీ హిందూ టెంపుల్’ విషయమై పెదవి విప్పకపోవడం మరింత బాధాకరమైన అంశం.