Godfather మెగాస్టార్ చిరంజీవి.! ఆయనొక శిఖరం.! ఆయన మీద ఉమ్మేయాలని చూస్తే ఏమవుతుంది.? ఆ ప్రయత్నం చేసినవాళ్ళ మొహానే పడుతుంది.
నటుడిగా శిఖరమంత ఎత్తుకు ఎదిగిన ఆయన ఖ్యాతి, ఒక్క సినిమాతో నేలకు దిగుతుందా.? 150కి పైగా సినిమాలతో కష్టపడి సాధించుకున్న పేరు ప్రఖ్యాతులవి.
తెలుగు సినిమాకి గాడ్ ఫాదర్ చిరంజీవి. తెలుగు సినిమాకి కష్టమొస్తే, అర్హత లేనోళ్ళ ముందైనా చేతులు కట్టుకుని కూర్చుని, పరిశ్రమ కష్టాన్ని తొలగించేందుకు తనవంతు ప్రయత్నం చేసిన మహానుభావుడాయన.!
Godfather రాడనుకున్నారా.? రాలేడనుకున్నారా.?
రాజకీయాల్లోకి వెళ్ళిన చిరంజీవి, కొన్నేళ్ళపాటు సినిమా రంగానికి దూరమయ్యారు. రీ-ఎంట్రీలో.. వస్తూనే వంద కోట్ల సినిమా చేసిన ఘనత చిరంజీవికి కాక ఇంకెవరికి దక్కుతుంది.?

తెలుగు సినీ పరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు సాటి ఇంకెవరూ రారు. ఒకటి నుంచి పది వరకూ.. నెంబర్స్ అన్నీ ఆయనవే. ఆ తర్వతే, ఏ శుక్రవారం ‘నంబర్ వన్ హీరో’ అయినా.!
‘గాడ్ ఫాదర్’ లెక్కే వేరు.!
మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కంటే ముందు మలయాళ వెర్షన్ చూసినవారు కూడా, అందులో మెగాస్టార్ చిరంజీవిని ఊహించుకున్నారు.
చివరికి అది మెగాస్టార్ చిరంజీవి చేతికి వచ్చింది. వచ్చాక, ఆ సినిమా ఎలా వుండబోతోంది.? ఆ మెగా పవర్ ఎలా వుంటుంది.? అనే ఉత్కంఠ కలగడం సహజమే.!
సినిమా ఎలా వుంటుందన్నది వేరే చర్చ. సినిమా రిలీజ్‌కి ముందు చిరంజీవి చెప్పిన సినిమాటిక్ డైలాగ్స్ చాలామందికి వెన్నులో వణుకు పుట్టించింది. దటీజ్ మెగాస్టార్.!
Also Read: God Father డిజాస్టర్ కోసం వాళ్ళంతా వెయిటింగ్.!
ముందే చెప్పుకున్నాం కదా.. చిరంజీవి ఓ శిఖరం.! ఒక్క ఫ్లాప్.. ఆయన్నేమీ చేయలేదు.. ఎన్నేళ్ళయినా.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.!
పూనకాలు మొదలయ్యాయ్.. అంచనాలకు ఆకాశమే హద్దు.. అన్నట్టుంది పరిస్థితి.
థియేటర్ల వద్ద హంగామా చూస్తోంటే, తెలుగు సినిమాకి సరికొత్త పండగ మెగాస్టార్ సినిమాతోనే వస్తుంటుందనిపించడంలో వింతేముంది.?