Gold Silver Price Magic.. పెరుగుట విరుగుట కొరకే.. అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఇక్కడ పెరగడం తప్ప.. తగ్గడం అనేదే వుండదన్నది బంగారం, వెండి.. లాంటి లోహాల గురించి చెప్పుకుంటుంటాం.
పాతికేళ్ళ క్రితం ఐదు వేల రూపాయలకు అటూ ఇటూగా వున్న పది గ్రాముల బంగారం, ఇప్పుడు అక్షరాలా లక్షన్నర. కాదు కాదు, లక్షా అరవై వేల పైన.
వెండి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు లక్షల ముప్ఫయ్ వేల రూపాయలను టచ్ చేసింది కిలో వెండి. ఐదు లక్షల వైపుగా పరుగులు పెడుతుందని అంతా అనుకున్నారు.
రెండు లక్షల దిశగా బంగారం పరుగులు తీయడం పట్ల చాలామంది ఆశ్చర్యపోయారు.. లక్షా తొంభై వేలకు దగ్గర్లోకి వెళ్ళి, మళ్ళీ వెనక్కి వచ్చేసింది పది గ్రాముల బంగారం.
Gold Silver Price Magic.. పెరిగింది.. విరిగింది.. వెన్నుపోటు పొడిచింది..
పెరుగుతూ.. పెరుగుతూ.. పోతోంటే, బంగారం అలానే వెండిపై పెట్టుబడులు పెట్టకుండా వుంటారు.? ఎడా పెడా వేలు, లక్షలు, కోట్లు గుమ్మరించేశారు కొందరు.
డిజిటల్ గోల్డ్.. డిజిటల్ సిల్వర్.. అంటూ, స్మార్ట్ ఫోన్లలోనూ ‘ఊరించిన’ బంగారం, వెండి వైపు సామాన్యులు సైతం ‘పెట్టుబడి’ కోణంలో మొగ్గు చూపారు.
కట్ చేస్తే, నష్టాలు.. భారీ నష్టాలు వచ్చిపడ్డాయ్. నాలుగున్నర లక్షలు టచ్ చేస్తుందనుకున్న వెండి, రెండున్నర లక్షలకు పడిపోతే.. ఆ పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవడం కష్టం.
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
ఆ దారుణ పరిస్థితిని భరించడం ఇంకా కష్టం. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఆ పరిస్థితుల్ని అంచనా వేయడం సామాన్యులకు కష్టమే కదా.! అందుకే, నిలువునా మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు.
మళ్ళీ బంగారం పుంజుకుంటుందా.? వెండి మరోమారు ఐదు లక్షల దిశగా పరుగులు పెడుతుందా.? ఏమో, చెప్పలేం. రాత్రికి రాత్రి సీన్ మారిపోవచ్చు.
