Grandhalayam Movie Preview.. అచ్చ తెలుగు టైటిల్‌తో సినిమా ఎప్పుడొచ్చినా, దాన్ని ఒకింత ఆసక్తిగా చూడటం మామూలే.! అసలు గ్రంధాలయం అంటే ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘సారీ’ని కూడా తెలుగులో చేర్చేశారనే డైలాగ్ చెప్తారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ‘లైబ్రరీ’ని కూడా తెలుగీకరించేసి, ‘గ్రంధాలయం’ అనే హార్ట్ టచింగ్ మాటని కాలగర్భంలో కలిపేశాం.!
అలాంటి, ‘గ్రంధాలయం’ అనే అందమైన పేరుని టైటిల్‌గా పెట్టి సినిమా తెరకెక్కించాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాయి శివన్. ‘శేఖరం గారి అబ్బాయి’ అనే సినిమా చేసిన యువ నటుడు విన్ను మద్దిపాటి ఈ సినిమాలో హీరో.!
పబ్లిసిటీ పరంగా చూసుకుంటే, ‘గ్రంధాలయం’ పేరు పెద్దగా వినిపించలేదన్నది నిర్వివాదాంశం. కానీ, సినిమాకి సంబంధించి టీజర్, సాంగ్ ప్రోమోస్, ట్రైలర్.. ఇలా ఒకటొకటిగా బయటకు వచ్చాక, సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
Grandhalayam Movie Preview.. దైవత్వమే..
‘స్వామిరారా’, ‘కార్తికేయ’ లాంటి సినిమాల్లో దైవత్వమే వాటిని ముందుకు నడిపించిందేమో.. అంటూ ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి, ‘గ్రంధాలయం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి.

నిజానికి, ‘గ్రంధాలయం’ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులెదురయ్యాయని తెలిశాక, ‘ఇప్పట్లో సినిమా విడుదల కాదేమో’ అనిపించింది. కానీ, అనూహ్యంగా.. తక్కువ టైమ్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.. ఆల్ ఆఫ్ షడెన్.. అని చెప్పొచ్చు.
అది ఓ గ్రంధాలయం.. అందులో ఓ గ్రంధం.. అది చదివినవారు చనిపోతారట.! ఎందుకు.? ఏమిటి.? అన్నది తెరపై చూడాల్సిందే. మేకింగ్ విజువల్స్, సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడిందీ చెప్పకనే చెబుతున్నాయ్.
ఔను.. ప్రాణం పెట్టేశారు..
‘ప్రాణం పెట్టేశారు’ అన్నది చిన్నమాటే అనిపిస్తుంది, హీరో విన్ను, దర్శకుడు సాయి శివన్.. ఈ సినిమా గురించి చెబుతున్నప్పుడు. దర్శకుడు సాయికి ఇది రెండో సినిమా. కానీ, మొదటి సినిమా ‘వైరం’ కంటే ముందుగా రెండో సినిమా ‘గ్రంధాలయం’ విడుదలవుతోంది.

పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. అన్నీ ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయి. యాక్షన్ బ్లాక్స్ సైతం వేరే లెవల్.. అన్న భావన కలగడం సహజం.
Also Read: వెన్నుపోటు: అభిమానులే ఎన్టీయార్‌ని బజారుకీడ్చేశారు.!
కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు.. అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడాలుండవ్ ప్రేక్షకులకి.
‘గ్రంధాలయం’ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిద్దాం.!