Table of Contents
Guntur Kaaram Collections Nagavamsi.. ‘మా యాపారమ్.. దాన్ని మేమెందుకు రోడ్డు మీద పెట్టుకుంటామ్.? మేం నిజాలు చెప్పమ్.!’ అంటున్నారు సినీ నిర్మాత నాగవంశీ.!
చిన్న వయసులోనే పెద్ద నిర్మాతగా మారిన నాగ వంశీ, పలు పెద్ద సినిమాల్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ తదితర స్టార్స్‌తో సినిమాలు తీశారాయన.!
‘గుంటూరు కారం’ సినిమా వసూళ్ళ విషయమై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ రచ్చపై నిర్మాత నాగ వంశీ స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించారు.
Guntur Kaaram Collections Nagavamsi.. నిర్మాత వాదన ఇదీ..
తమ సినిమా మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయిందనీ, లాభాల బాటలో సినిమా వుందనీ చెప్పుకొచ్చారు నాగవంశీ.
కాగా, సినిమా డిజాస్టర్ అయ్యిందనీ, వసూళ్ళ లెక్కలెంతో చేతనైతే చెప్పాలనీ వెబ్ మీడియాలో సవాళ్ళ పర్వం నిర్మాణ సంస్థ వైపు దూసుకెళుతోంది.

ఈ క్రమంలో నాగ వంశీ ఒకింత సీరియస్ అయ్యారు. ‘మీడియాకి అందే లెక్కలన్నీ కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే..’ అని తేల్చేశారు.
లాభ నష్టాల పంచాయితీ..
లాభ నష్టాలు నిర్మాతకు మాత్రమే తెలుస్తాయని చెప్పారు నాగవంశీ. ఇంకెవరికీ ఈ విషయాలు తెలిసే అవకాశమే లేదని ఆయన కుండబద్దలుగొట్టేశారు.
అంతేనా, ‘మేం నిజాలు చెప్పం..’ అని నాగవంశీ వ్యాఖ్యానించడం గమనార్హం. నిజాలు చెప్పకపోతే, పోస్టర్ల మీద కనిపించే నెంబర్లన్నీ అబద్ధాలేనా.? అంతే అనుకోవాలేమో.!
Also Read: Malaika Arora: ఆమె ముందు వయసు ఓడిపోయింది.!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి కారం.!
సంక్రాంతి పండక్కి విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమా తొలి రోజే విపరీతమైన నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే, సంక్రాంతి సీజన్ ‘గుంటూరు కారం’ సినిమాకి బాగానే కలిసొచ్చింది. అలాగని, సినిమా లాభాల్లో వుందా.? అంటే, నష్టాలు తగ్గించుకోగలిగిందని మాత్రం చెప్పగలం.!
నిర్మాత చెబుతున్నారు కాబట్టి, ‘గుంటూరు కారం’ అందరికీ సేఫ్ వెంచర్ అనుకోవాల్సిందే.! మనకెందుకు ఆ లెక్కల పంచాయితీ.?