Guntur Kaaram First Review.. అది ‘అజ్ఞాతవాసి’ సినిమా సమయం.! బోల్డంత హంగామా విడుదలకు ముందు.! కానీ, సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.!
ఇప్పుడు మళ్ళీ అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా.! హీరో మారాడు.! రిజల్ట్ మాత్రం దాదాపుగా అంతే.! అంతకన్నా ఘోరం.. అని కూడా అంటున్నారు.!
అప్పుడే అంత తొందరేంటి.? సాయంత్రానికి కదా లెక్కలు తేలతాయ్.! పైగా, హీరో మహేష్‌బాబు కాబట్టి, ‘సర్కారు వారి పాట’ తరహాలో మ్యాజిక్ జరుగుతుందేమో.. అని కొందరికి చిన్న ఆశ.!
కానీ, తెల్లారేసరికే టాక్ బయటకు వచ్చేసింది. గుంటూరు ఘోరమ్ అంటాడొకాయన.! దారుణం భయ్యా.. అంటాడు ఇంకో కుర్రాడు.!
Guntur Kaaram First Review.. ఇలా చేశావేంటి గురూజీ.?
ఏంటి గురూజీ ఇలా చేశావ్.? అని దాదాపుగా సినిమా చేసిన మహేష్ అభిమానులంతా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘గుంటూరు కారం’ గురించి అమెరికా నుండి ఆంధ్రా వరకూ ఒకటే టాక్.! అదీ డిజాస్టర్ టాక్.!
ఓపెనింగ్స్ అదిరిపోయాయ్. ఓవర్సీస్‌లో అయితే, దుమ్ము దులిపేసింది ప్రీమియర్ షో ద్వారా.! ప్చ్, ఇకపై నిలబడటం చాలా చాలా కష్టం.
‘సర్కారు వారి పాట’ సినిమా తరహాలో ఏదన్నా అద్భుతం జరిగి, ఫర్వాలేదు.. అనిపించుకోవాలి. కానీ, ‘గుంటూరు కారం’ సినిమాకి అంత సీన్ వుంటుందా.?
సంక్రాంతి ఆదుకుంటుందా.?
సంక్రాంతి సీజన్ కదా.. ఎలాగోలా గట్టెక్కేస్తుందన్న ఆశ అయితే, మహేష్ అభిమానుల్లో కనిపిస్తోంది. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి మ్యాజిక్కూ చేయలేదు.
శ్రీలీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. ఇలా ఎవరూ ‘గుంటూరు కారం’ కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అసలు చేసిందేమీ లేదు.
Also Read: ఈ చిన్ని ‘హనుమాన్’ ఏం పాపం చేశాడని.?
కాకపోతే, మహేష్‌బాబు కష్టపడ్డాడు. డాన్సులు చాలా బాగా చేశాడు. కామెడీ టైమింగ్ అదిరింది. కాకపోతే, పంచ్‌లు సరిగ్గా పేలలేదు. అది రాతలో జరిగిన తప్పిదం.
ఎలా చూసినా, ‘గుంటూరు కారం’ గట్టెక్కడం దాదాపు అసాధ్యం.! గుంటూరు ఘోరమ్.. ఇంకోసారి ఇలా చెప్పుకోవాల్సి వస్తోంది.
ఇది జస్ట్, చూసిన ఆడియన్స్ నుంచి వస్తోన్న రిపోర్ట్స్ తాలూకు సారాంశం మాత్రమే. పూర్తి రివ్యూ.. కోసం కాస్త ఆగండి.!