Hamsa Nandini.. ఇంకోసారి జన్మించడమేంటి.? ఔను, ఆమె ఎదుర్కొన్న సమస్య అలాంటిది. ప్రాణాంతక సమస్య నుంచి బయటపడింది.
అప్పుడెప్పుడో క్రియేటివ్ డైరెక్టర్ వంశీ రూపొందించిన ‘అనుమానాస్పదం’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హంసా నందిని.
ఆ తర్వాత చిన్నా చితకా సినిమాల్లో నటించిందిగానీ, నటిగా సరైన గుర్తింపు రాలేదు. ఇక ఇలా కాదనుకుని ఐటమ్ బాంబులా మారిపోయిన ఈ బ్యూటీ, సక్సెస్ కొట్టింది.
Hamsa Nandini మిర్చి బాంబులా పేలింది..
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిర్చి’ సినిమాలోని ఐటమ్ సాంగ్ హంసా నందిని దశని మార్చేసింది. ఆ తర్వాత వరుసగా ఐటమ్ సాంగ్స్ వచ్చాయి.. వచ్చిన ఏ అవకాశాన్నీ ఆమె వదులుకోలేదు.

కానీ, ఇంతలోనే విధి వెక్కిరించింది. క్యాన్సర్ బారిన పడ్డట్టు తేలడంతో హంసా నందిని ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
అయినాగానీ, ధైర్యం తెచ్చుకుంది హంసా నందిని. క్యాన్సర్‌తో పోరాడింది, ఎలాగైతేనేం.. విజయం సాధించింది.
చికిత్స సమయంలో చాలా బాధను అనుభవించాననీ, శారీరకంగా.. మానసికంగా అనుభవించిన బాధ అంతా ఇంతా కాదని హంసా నందిని పేర్కొంది.
షీ ఈజ్ బ్యాక్..
క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాక, తిరిగి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోందీ హంస. తన తాజా చిత్రం షూటింగ్‌కి హాజరైన హంస, తాను పునర్జన్మ పొందానంటూ పేర్కొంది.
నిజమే.. నటిగా ఇది ఆమెకు పునర్జన్మ లాంటిదే. సీనియర్ నటి గౌతమి, సింగర్ అలాగే నటి అయిన మమతా మోహన్ దాస్.. క్రికెటర్ యువరాజ్ సింగ్.. ఇలా క్యాన్సర్‌ని జయించిన ప్రముఖులు చాలామందే వున్నారు.

క్యాన్సర్ సోకితే ఇక అంతే సంగతులు.. అనే అభిప్రాయం ఒకప్పుడు వుండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే తదితరులు క్యాన్సర్ బారిన పడ్డారు.
Also Read: లావణ్య త్రిపాఠి.! అందమైన మతిమరుపు.!
మనీషా అయితే ఇక బతకదని అంతా అనుకున్నారు. సోనాలి విషయంలోనూ అదే జరిగింది. కానీ, ఈ ఇద్దరూ కోలుకున్నారు.
ఆ లిస్టులో తాజాగా హంసా నందిని పేరు చేరిందంతే.! హంస ఈజ్ బ్యాక్.. ఐటమ్ బాంబులా మళ్ళీ పేలుతుందో.. నటిగా స్టార్డమ్ వేరే రూపంలో అందుకుంటుందో.. వేచి చూడాల్సిందే.