Hansika Motwani Divorce.. హన్సిక మోత్వానీ.. కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు కదా.! తెలుగు సినీ అభిమానులకైతే, ‘దేశముదురు’ బ్యూటీ అనే తెలుసు.!
బాలీవుడ్‌లో బాల నటిగా తెరంగేట్రం చేసి, తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ నటించిన హన్సిక, ఇప్పుడు వార్తల్లోకెక్కింది.
కొన్నాళ్ళ క్రితం స్నేహితుడు సొహైల్‌తో పెళ్ళి పీటలెక్కింది హన్సిక. సొహైల్‌కి అంతకు ముందే పెళ్ళవడం, అది వేరే కథ అనుకోండి.!
2022 డిసెంబర్‌లో హన్సిక – సొహైల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏమయ్యిందోగానీ, గత కొన్నాళ్ళుగా ఈ ఇద్దరూ విడిగా వుంటున్నారు.
Hansika Motwani Divorce.. ఔనా.? అది నిజమా.?
తాజాగా, హన్సిక తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెళ్ళి ఫొటోల్ని, వీడియోల్ని తొలగించింది. దాంతో, హన్సిక – సొహైల్ విడిపోవడం ఖాయమైపోయిందంటూ వార్తలొస్తున్నాయ్.
అయితే, సొహైల్‌తో విడాకుల విషయమై ఇంతవరకు హన్సిక మోత్వానీ ఎక్కడా పెదవి విప్పింది లేదు. ఇద్దరి మధ్యా మనస్పర్ధల గురించీ ఆమె మాట్లాడింది లేదు.

అన్నట్టు, హన్సిక వెడ్డింగ్ వీడియో అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. ఓ ఓటీటీ సంస్థ ఆ మొత్తం వెడ్డింగ్ కవరేజ్ ఓ రేంజ్‌లో చేసింది లెండి.!
ఇక, సెలబ్రిటీలు తమ విడాకులకు ముందు, జీవిత భాగస్వామితో కలిసి వున్న ఫొటోల్ని సోషల్ మీడియా నుంచి ‘డిలీట్’ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
తొలగించడమంటేనే.. విడిపోవడం.. అన్నట్టు.!
అలా, సోషల్ మీడియా నుంచి ఫొటోల్ని డిలీట్ చేయడమంటేనే, ‘విడిపోవడానికి’ సంకేతం.. అని మీడియా కూడా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది.
Also Read: చెప్పు తెగుద్ది.! అవసరమా అనసూయా.!? ఆకతాయిలు తిరగబడితే.?
చాలా అరుదుగా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రక్షాలణలో భాగంగా, పాత కంటెంట్‌ని తొలగిస్తుంటారు కొందరు సెలబ్రిటీలు.
హన్సిక ఏ ఉద్దేశ్యంతో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెళ్ళి ఫొటోల్ని తొలగించిందోగానీ.. ఇప్పుడీ వ్యవహారం.. హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ, ‘విడిపోవడం’పై జరుగుతున్న ప్రచారంపై హన్సిక స్పందిస్తుందా.? వేచి చూడాల్సిందే.
