Hari Hara Veera Mallu Aa Naluguru.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే మామూలు విషయం కాదు. అలాంటిది, ఇప్పుడాయన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.!
మరి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాని అడ్డుకోవాలని ‘కుట్రలు’ చేయడమేంటి.? అసలు, ఆ నలుగురి వెనక వున్నదెవరు.?
పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరి హర వీర మల్లు’ విడుదలకు సిద్ధమైంది. జూన్‌లో సినిమా విడుదల కానుండగా, జూన్ 1 నుంచి థియేటర్ల బంద్.. అంటూ, రచ్చ జరుగుతోంది.
Hari Hara Veera Mallu Aa Naluguru.. థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని ఆడుతున్న రాక్షస క్రీడ..
ఇంతకీ, థియేటర్లు ఎవరి చేతుల్లో నలిగిపోతున్నాయి.? ఆ నలుగురూ ఈ కుట్రకి ఎందుకు తెరలేపారు.? అన్న విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
సమస్య పరిష్కారం కోసం ఇటీవల హైద్రాబాద్‌లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఓ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్, బలంగా తలుపు తన్నాడంటూ, ఓ ఎర్నలిస్టు గాసిప్పు వదిలాడు.
తలుపు తన్నిన గాసిప్ రాయించిందే, ఆ నిర్మాత.. అని ఆ తర్వాత తెలిసిందనుకోండి.. అది వేరే విషయం.
‘హరి హర వీర మల్లు’ సినిమా రిలీజ్‌ని ఆపగలిగే ధైర్యం సోకాల్డ్ ‘ఆ నలుగురు’కి వుందా.? అన్నదే అసలు చర్చ. ప్రశ్నకు సమాధానం అయితే, ‘అంత సీన్ లేదు’ అనే.
కుట్రలతో కుళ్ళి కృశించిపోతారు పోతారు జాగ్రత్త..
కానీ, ప్రయత్నమైతే గట్టిగానే చేస్తున్నారు. ప్రయత్నం కాదిది, కుట్ర.! అసలు, థియేటర్లు మూసెయ్యాలనే కుట్ర వెనక వున్నదెవరన్నదానిపై, ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు.
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ఈ మొత్తం వ్యవహారంపై ‘కూపీ లాగుతున్నారు’.! ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఆయన స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల సంగతి తెలుసు కదా.? ఆ నలుగురినీ సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. ఇకపై, ఆ నలుగురి నుంచి వచ్చే ఏ సినిమా అయినా బాయ్ కాట్ చేసి తీరతాం.. అని హెచ్చరిస్తున్నారు.
సంక్రాంతి సీజన్ సర్వనాశనమైపోయింది. ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. సంక్రాంతికి వచ్చిన సినిమాలకు సంబంధించిన థియేటర్ల లొల్లి తెలిసిన విషయమే.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
ఆ నలుగురి చేతిలో థియేటర్లు పెట్టుకుని, సినీ పరిశ్రమను శాసించాలనే ప్రయత్నమైతే జరుగుతోంది. సినీ కళామతల్లితో నిత్యం కన్నీరు పెట్టిస్తున్నారు ఆ నలుగురు.
ఈ కుట్రలకు ఇప్పుడే ఫుల్ స్టాప్ పడిపోవాలి.! ఒక ప్రభుత్వమే, పవన్ కళ్యాణ్ సినిమాకి వ్యతిరేకంగా గతంలో పని చేసినా, ఆ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడం వీలు కాలేదు.
ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ ప్రభుత్వంలో భాగస్వామి. కీలక పదవిలో వున్నారు పవన్ కళ్యాణ్. సో, అరచేతిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలనుకుంటే.. ‘పోతారు.. మొత్తం పోతారు’.!
చివరగా.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’.. ఇదీ పవన్ కళ్యాణ్ అభిమానుల డైలాగ్.!