Hbd Bhagyashri Borse.. లక్కు తోక తొక్కింది భాగ్యశ్రీ.! ఔను, నిజంగానే లక్కు తోక తొక్కేసింది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.!
తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ అయినాగానీ, అవకాశాలు పోటెత్తుతున్నాయ్ ఈ బ్యూటీకి.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ (Mass Maharaja Raviteja) హీరోగా తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. హిందీ ‘రెయిడ్’కి తెలుగు రీమేక్ ఇది.!
సినిమా ప్రమోషన్లలో భాగ్యశ్రీ బోర్సే చేసిన హంగామా అంతా ఇంతా కాదు.! ‘మంచి డాన్సర్’ అనే గుర్తింపు తొలి సినిమాతోనే సొంతం చేసుకుంది. నటన పరంగానూ మార్కులేయించుకుంది.
Hbd Bhagyashri Borse.. గ్లామర్ విషయంలో మొహమాటాల్లేవ్..
గ్లామర్ విషయంలో భాగ్యశ్రీ అస్సలేమాత్రం మొహమాట పడలేదు కూడా.! బహుశా, అదే భాగ్యశ్రీకి ఇప్పుడిలా అవకాశాలు పోటెత్తేలా చేస్తోందని అనుకోవచ్చేమో.
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, భాగ్యశ్రీ బోర్సే కళ్ళ మీదనే ఫోకస్ పెడుతూ, పోస్టర్స్ డిజైన్ చేస్తుండడం.
తెలుగులో ప్రస్తుతం భాగ్యశ్రీ రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి, రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కాగా, మరొకటి విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా.

‘కింగ్‌డమ్’ పేరుతో విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత రామ్ – భాగ్యశ్రీ కాంబినేషన్‌లో సినిమా విడుదల కానుంది.
ఇదిలా వుంటే, ప్రభాస్ హీరోగా తెరకెక్కే పాన్ ఇండియా మూవీ కోసం భాగ్యశ్రీతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా, మరో నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయి.
Also Read: Vaibhav Suryavanshi చిన్నోడు.. చిచ్చర పిడుగు! చితక్కొట్టేశాడు!
అన్నట్టు, ‘కాంత’ పేరుతో తెరకెక్కుతోన్నసినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తోంది భాగ్యశ్రీ బోర్సే.

భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా, ఆయా చిత్రాల టీమ్స్ ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ, స్పెషల్ పోస్టర్స్ విడుదల చేశాయ్.
ఎలా చూసినా, భాగ్యశ్రీ బోర్సే లక్కు తోక తొక్కినట్లేనేమో.! హ్యాపీ బర్త్ డే భాగ్యశ్రీ.!