Hbd Global Star Ramcharan మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్.! అది ఒకప్పుడు. ‘రామ్ చరణ్ తండ్రిని నేను..’ అని చిరంజీవి గర్వంగా చెప్పుకుంటున్నారిప్పుడు.! పుత్రోత్సాహమిది.!
తొలి సినిమా ‘చిరుత’ విషయంలో (Ram Charan) రామ్ చరణ్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓ మేధావి అయితే, రామ్ చరణ్ గురించి ‘బాడీ షేమింగ్’ చేశాడు నిస్సిగ్గుగా.!
కానీ, రామ్ చరణ్ (Global Star Ram Charan) అవేవీ పట్టించుకోలేదు. తన లక్ష్యాన్ని సినీ రంగంలోకి రాక ముందే నిర్దేశించుకున్నట్టున్నాడు. ఆ లక్ష్యం వైపుగా దూసుకు పోయాడు.!
Hbd Global Star Ramcharan ప్రతిసారీ అంతకు మించి.!
‘ఆరెంజ్’ లాంటి ఫెయిల్యూర్ వచ్చినాసరే, నటుడిగా ఏ సినిమాతోనూ నెగెటివ్ మార్కులేయించుకోలేదు రామ్ చరణ్. మీడియాలో ఓ వర్గానికి రామ్ చరణ్ నచ్చలేదు.. ఇప్పటికీ నచ్చడంలేదు కూడా.!
కులం పేరుతోనో, ఇంకో కోణంలోనో రామ్ చరణ్ (Man Of Masses Ram Charan) మీద నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే వుంటుంది.
అయినా కానీ, రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఇమేజ్ ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదుగుతోంటే, ఆ గ్రామ సింహాల మొరుగుడుని పట్టించుకునేదెవరు.?
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
‘మగధీర’ (Magadheera), ‘రంగస్థలం’ (Rangasthalam), ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie).. ఇలా నటుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ.. ‘తండ్రిని మించిన తనయుడు’ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan) అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్.! మెగా పవర్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఇప్పుడేమో గ్లోబల్ స్టార్ (Global Star Ram Charan).!

ఇలా అంచలంచెలుగా రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదిగాడంటే.. తండ్రి నుంచి లభించిన నటనా వారసత్వంతోపాటుగా, ఆ క్రమశిక్షణ, ఆ నిబద్ధత.. ఇవన్నీ కారణం.
డాన్సులేస్తాడు.. ఫైట్స్ బాగా చేస్తాడు.. అంతేనా.? మంచి నటుడే కాదు, మంచి మనిషి కూడా.. అనేంతలా అందరి నుంచీ ప్రశంసలు అందుకుంటున్నాడు రామ్ చరణ్.
సినీ రంగంలో ముందు ముందు మరిన్ని కీర్తి కిరీటాల్ని రామ్ చరణ్ అందుకోవాలని ఆశిస్తూ.. ఆకాంక్షిస్తూ.. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.! Happy Birthday Global Star Ram Charan.!