Table of Contents
Health Benefits Of Amla.. ప్రకృతి ప్రసాదించిన వరం ఉసిరి. శీతాకాలంలో ఎక్కువగా లభించే ఈ ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
అయుర్వేదంలోనూ ఉసిరికి ప్రత్యేకమైన స్థానం వుంది. ఉసిరి కాయలను మన ఆహారంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
తద్వారా ఊరికూరికే వచ్చే జలుబు, దగ్గు, సైనస్ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Health Benefits Of Amla.. ఉసిరితో ఇన్ని లాభాలా.?
ఉసిరి చెట్టులో వేరు నుంచి చివరి వరకూ ప్రతీ భాగమూ ఔషధంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉసిరిలో విటమిన్ ‘సి’ అధికంగా వుంటుంది.
అందుకే ప్రతీ రోజూ ఒక్క ఉసిరికాయ తిన్నా ఆరోగ్యానికి అది చేసే మేలు అంతా ఇంతా కాదు. కంప్లీట్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా పని చేస్తుంది ఉసిరి.
ఉసిరి చెట్టు గాలి ఎంతో స్వచ్ఛమైనది..
అందుకేనేమో, కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు..
ఉసిరి చెట్టు కింద ‘వన భోజనాలు’ చేయడం అనేది ఓ సంప్రదాయంగా వస్తోంది.
ఉసిరి ఆకు, చెట్టు బెరడు.. ఇలా అన్నీ ఔషద గుణాలున్నవే..
Mudra369
వ్యాధులతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచి ఎన్నో రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడేందుకు తోడ్పడుతుంది ఉసిరి. కళ్లకు సంబంధించి చిన్నచిన్న వ్యాధుల్ని నియంత్రించడంలో ఉసిరి తోడ్పడుతుంది.
ఉసిరితో జుట్టు ఆరోగ్యం.!
హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలోనూ, జుట్టు అందంగా పెరగడానికి ఉసిరి తోడ్పడుతుంది. అంతేకాదు, శీతాకాలంలో చర్మం పొడిబారే సమ్య అధికం. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మెరిస్తుంది.

ప్రతీ రోజూ ఉసిరిని తీసుకోవడం వల్ల మెదడు పని తీరు చురుకవుతుంది. తద్వారా జ్ఞాపక శక్తి మెరుగువుతంది. కాలేయ సంబంధిత వ్యాధులకు ఉసిరి దివ్యౌషధంగా పని చేస్తుంది. డయేరియా వంటి సమస్యలను నివారిస్తుంది.
నెలసరి సమస్యల నివారణ..
నెలసరిలో వచ్చే తీవ్రమైన నొప్పుల్ని హరించడంతో పాటూ సంతానోత్పత్తిలోనూ ఉసిరి అత్యంత కీలకంగా పని చేస్తుంది. మగవారిలో వీర్య కణాల వృద్ధి రేటును పెంచుతుంది.
Also Read: ‘చిత్రం’ చెప్పే కథ.! రాసుకున్నోడికి రాసుకున్నంత.!
మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయ్. కొన్ని రకాల క్యాన్సర్లకు ఉసిరితో చెక్ పెట్టొచ్చని కొన్ని అధ్యయనాలు నిరూపించాయ్.
సూచన:
ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్న సమాచారం, అలాగే కొందరు వైద్య నిపుణులు, వ్యక్తుల ఆభిప్రాయాల సంకలనం మాత్రమే ఇది.
సొంత వైద్యం అత్యంత ప్రమాదకరం కావచ్చు. ఏ చిట్కా పాఠించాలన్నా వైద్య నిపుణుల సూచన, సలహా తప్పనిసరి.
ఒక మందు లేదా ఒక మూలిక అందరికీ ఒకేలా పని చేస్తుందని చెప్పలేం. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం.
Mudra369
ఉసిరి అధికంగా లభించే శీతాకాలంలో ఉసిరిని తీనడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఉసిరి కాయల్ని పొడి చేసుకుని జాగ్రత్త చేసుకుంటే, ఏడాది మొత్తం ఉపయోగించుకోవచ్చు.
పరగడుపున రోజూ, గ్లాసు నీళ్లలో కొద్దిగా ఉసిరి పొడి వేసుకుని తాగితే ఆరోగ్యపరంగా ప్రయోజనాలెన్నో.