Helicopter crash.. లోహ విహంగాలు కుప్పకూలిపోవడం.. ఎప్పుడూ ప్రధానమైన వార్తే అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల లోహ విహంగాలు కూలిపోయినా ప్రపంచమంతా చర్చించుకుంటుంది. ప్రమాదం జరిగాకా, మళ్లీ అలాంటి ఇంకో ప్రమాదం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
బోయింగ్ విమానాలకు సంబంధించి, ఓ సిరీస్ విమానాల్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. అంతే, ప్రపపంచ వ్యాప్తంగా ఆ సిరీస్ విమానాలన్నింటినీ అప్పటికప్పుడు తాత్కాలికంగా రద్దు చేశారు. మళ్లీ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి లోపాన్ని సరిదిద్దారు.
Helicopter Crash Bipin Rawat లోహ విహంగమంటే ఆషామాషీ కాదు మరి..
లోహ విహంగాల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారనే దానికి పైన చెప్పుకున్న ఉదంతమే నిదర్శనం. అయినా కానీ, ప్రమాదాలెందుకు జరుగుతున్నాయ్.? ప్రమాదం కాబట్టి, ప్రమాదవశాత్తూనే జరుగుతుంది. ప్రతి ప్రమాదం కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా పని చేసిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajasekhar Reddy) హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందూ, ఆ తర్వాతా హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయ్. తాజాగా భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ (Chief Of Defence Staff General Bipin Rawat) హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారు.
తప్పిదం.. ఎవరికి శాపం.?
పైలెట్ తప్పిదమనో, నిర్వహణా లోపమనో నిందలేసేయడం చాలా తేలిక. కానీ, పాయింట్ టు పాయింట్ చెకింగ్ జరుగుతుంద లోహ విహంగాల విషయంలో. ప్రధానంగా ఇలాంటి ప్రమాదాలకు వాతావరణమే కారణమవుతుంది. వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకునే మార్పులు లోహ విహంగాలకు సవాల్ విసురుతాయ్. వాటిని నడిపే పైలట్లకు అగ్ని పరీక్ష పెడతాయ్.
యుద్ధ విమానాలు సైతం కూలిపోవడానికి ప్రధాన కారణం సాంకేతిక సమస్య లేదా, అనుకూలించని వాతావరణ పరిస్థితులే. అయినా గానీ, ప్రమాదాలు జరిగినప్పుడు లోతైన విశ్లేషణ అవసరం. ముఖ్యమంత్రిని కోల్పోవడం ఎంత బాధాకరమో.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ని కోల్పోవల్సి రావడం అంతకన్నా బాధాకరం.
Also Read: Silk Smitha Death Mystery.. ఎందుకు చనిపోయిందో తెలుసా.?
ఇలాంటి ప్రమాదాల్లో మెరికల్లాంటి పైలట్లను కోల్పోవల్సి రావడం దురదృష్టకరం. యుద్ధ విమానాల్లో, పైలట్ తప్పించుకునే ఆఫ్షన్ ఉంటుంది. హెలికాప్టర్లలో ఆ అవకాశం ఉండదు. ప్రాణం చాలా చాలా విలువైనది. మనిషి తయారు చేసిన మెషీన్ కదా.. లోహ విహంగానికీ కొన్ని పరమితులుంటాయ్.. దాన్ని నడిపే పైలట్‌కి కూడా అంతే.!