Table of Contents
Heroines Tattoos Actual Reasons.. ‘పచ్చ బొట్టూ చెరిగిపోదులే పడుచు గుండె చెదిరిపోదులే..’ అంటూ అప్పుడెప్పుడో జమానా కాలంలో ఓ పాపులర్ సాంగ్ వుంది.
ఆ పచ్చబొట్టునే నయా కాలంలో ‘టాటూ’గా పిలుచుకుంటున్నాం.
అసలు విషయమేంటంటే, సెలబ్రిటీలుఛాతీ భాగం (Chest) లో టాటూ వేయించుకోవడం.. ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారిపోయింది.
ఆ మాటకొస్తే.. అందాల భామలే కాదండోయ్. అమ్మాయిల్లో చాలా మంది ఈ ట్రెండ్‌ని తెగ ఫాలో చేస్తున్నారు. టాటూ వేయించుకున్నాకా ఆ భాగాన్ని అందరికీ చూపించుకోవాలిగా.!
Heroines Tattoos Actual Reasons.. టాటూ.. అదో వంక..
ఆ వంకతో అమ్మాయిలు ధరించే దుస్తులు చిన్నవైపోతున్నాయ్. అందం, ఆత్మ విశ్వాసం.. అని ఏవేవో నీతులు చెబుతూ అందాల ప్రదర్శన చేసేస్తున్నారు అమ్మాయిలు.
అసలు అందానికీ, ఆత్మ విశ్వాసానికీ, ఎక్స్‌పోజింగ్‌కీ సంబంధం ఏంటీ.? అని ప్రశ్నించేవాళ్లూ లేకపోలేదు. ఆ ప్రశ్న కూడా బూతుగా మారింది నయా ట్రెండింగ్ కాలంలో.

ఇక, ఛాతీపై టాటూల విషయానికి వచ్చేస్తే.. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్ అయిన ఛాతీ భాగంలో టాటూ వేయించుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.
టాటూ వేయించుకున్నాకా ఆ భాగాన్ని ఎలివేట్ చేసుకోవాలి కదా..!
సెలబ్రిటీల్లో త్రిష, సీనియర్ నటి రోజా, బుల్లితెర బ్యూటీ అనసూయ తదితరులు ఛాతీ భాగంలో టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే.
సమంతకు వీపు భాగంలో టాటూ వుంటుంది. ఇంకా బుల్లితెర కమ్ సోషల్ మీడియా సెన్సేషన్ అయిన అషూ రెడ్డి తదితరులు ఆయా భాగాల్లో టాటూలు వేయించుకుని, అందాల ప్రదర్శన చేస్తుండడం చూస్తూనే వున్నాం.
అయితే, అందాల ప్రదర్శన, వస్ర్త ధారణ అనేది పర్సనల్. ఎవరి వస్ర్తధారణనూ ఎవ్వరూ శాసించరు. శాసించ కూడదు కూడా.!
ఛాతీ భాగంలోనే టాటూలు ఎందుకంటే.!
కానీ, సభ్యత, అసభ్యత అనే చర్చ వచ్చేసరికి ఎవరి అభిప్రాయాలు వారికుంటాయ్.. సంపార పక్షంగా వుండే మహిళ అసభ్యంగా వస్త్రాలు ధరించిన మహిళని చూసి ఛీదరించుకోవడం సహజమే.
కేవలం మగాడి చూపుల్లోనే వల్గారిటీ అని కొందరు అందాల భామలు తమ అందాల ప్రదర్శనను సమర్దించుకుంటుంటారు.

వల్గారిటీ అనేది చూసే కళ్లోనే, వేసుకునే డ్రెస్‌లో కాదని సోషల్ మీడియా వేదికగా క్లాసులు తీసుకుంటుంటారు.
బ్రైట్ స్కిన్‌ని ఎలివేట్ చేసుకోవడానికే ఎక్కువగా ఛాతిపైన టాటూ వేసుకుంటామంటున్నారు కొందరు అమ్మాయిలు.
కేవలం సరదా కోసమో, అందం, ఆత్వవిశ్వాసం కోసమనే కాకుండా, జాతకాలు కూడా టాటూలు వేయించుకోవడానికి ఓ కారణమంటున్నారు ఇంకొందరు.
టాటూకీ, కెరీర్‌కీ సంబంధం వుందా.?
ఎక్కడ, ఎలాంటి టాటూ వేయించుకుంటే ఆయా వృత్తుల పరంగా కెరీర్‌కి మంచి జరుగుతుందో తెలుసుకుని మరీ టాటూలు వేయించుకున్నారట ఈ మధ్య కాలంలో.
ఆ క్రమంలోనే వీపు పైనా, భుజాల పైనా.. నడుము మడతల్లోనూ టాటూలు ఇటీవలి కాలంలో ట్రెండింగ్‌గా మారాయ్. ఒక వైపు కాలి పై భాగం అంతా.. లేదా రెండు కాళ్లకీ టాటూలు వేసుకోవడం కూడా కామన్ అయిపోయింది.
Also Read: సామాజికోన్మాదం.. సమాజ వినాశనానికి సంకేతం.!
టాటూ వేసుకున్నాకా ఆయా శరీర భాగాలను చూపించాలి కదా.. అందుకే పొట్టి దుస్తుల ప్రదర్శన. అందం చూడవయా.. ఆనందించవయా.! ఈ వివాదాలెందుకయా.!
గమనిక: సరదా, నమ్మకం, లేదా మరే ఇతర కారణమైనా సరే, టాటూ అనేది ఆరోగ్య పరంగా మంచిది కాదు. అందుకే టాటూలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధనీయం కాదు.