Himaja Bigg Boss.. గాసిప్స్ లేని గ్లామర్ ప్రపంచాన్ని ఊహించుకోగలమా.? ఫలానా హీరో పెళ్లంట.!, ఫలానా హీరోయిన్‌కి అఫైర్ అంట.! అంటూ వచ్చే గాసిప్స్‌కి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు, అయితే ఇది పాత ముచ్చటే. కొత్త ముచ్చట ఏంటంటే, ఇప్పుడు విడాకుల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది.
‘వాళ్లిద్దరూ విడిపోతున్నారట..’ అనే గాసిప్ చాలా సందర్భాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. సమంత, నాగ చైతన్య విషయంలో జరిగిందదే. ఇదిలా వుంటే, నటి హిమజ (బిగ్‌బాస్ ఫేమ్) చుట్టూ బోలెడన్ని గాసిప్స్ వినిపించాయ్. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంటోందని తాజాగా జరిగిన ప్రచారం.
ఇంతకీ హిమజ పెళ్ళెప్పుడైంది.?
అసలు హిమజకు పెళ్లెప్పుడైంది.? అన్నప్రశ్న చాలా మంది మెదళ్లలో మెదిలింది. ఒక్కసారేం కర్మ.. రెండు సార్లు పెళ్లయ్యింది అంటూ కొన్ని మీడియా కథనాలు కూడా పుట్టుకొచ్చాయ్. దాంతో, అవునా.? అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక ఈ పెళ్లి – విడాకుల వ్యవహారం ఆ నోటా, ఈ నోటా హిమజ దాకా వెళ్లింది.

ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. సన్నిహితుల సూచనల మేరకు హిమజ ఈ వ్యవహారంపై స్పందించింది. ‘నాకు విడాకులా.?’ ఆ విడాకుల కార్యక్రమానికి నన్నయినా పిలుస్తారా.? అంటూ హిమజ నవ్వుతూనే ఈ గాలి వార్తలపై అసహనం వ్యక్తం చేసింది.
Himaja Bigg Boss ఇప్పుడా ఉద్దేశ్యం లేదట.!
అన్నట్లు, నాలుగేళ్లదాకా పెళ్లి చేసుకునే వుద్దేశ్యం లేదని చెప్పడం ద్వారా తనకింకా పెళ్లి కాలేదనే క్లారిటీ ఇచ్చేసింది హిమజ. ఇక, కెరీర్ పరంగా బిజీగా వున్నానంటోన్న హిమజ, ఈ మధ్యనే కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయడం, ఆ వెంటనే విడాకుల ప్రచారం జరగడం పట్ల అసహనం వ్యక్తం చేసింది.
Also Read: Ashu Reddy కాన్ఫిడెన్స్.. హాటుగా ఘాటుగా.?
హిమజ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నానంటూ హిమజ చెప్పింది. నిప్పు లేకుండా పొగ రాదన్నది పాత మాట. యూ ట్యూబ్ ఛానెళ్ల కక్కుర్తి పుణ్యమా అని మెయిన్ స్ర్టీమ్ మీడియా పైత్యం వల్ల కానీ, ఇదిగో ఇలా సెలబ్రిటీలు ఆవేదన చెందాల్సి వస్తోంది మరి.