Home » ఏందిరా.! రష్మిక ఇలా ఎందుకు తయారయ్యిందిరా.?

ఏందిరా.! రష్మిక ఇలా ఎందుకు తయారయ్యిందిరా.?

by Mudra369 Editorial Desk
0 comments
Rashmika Mandanna

Rashmika Mandanna Endiraa.. అభిమానుల్ని ఉద్దేశించి ‘రేయ్’ అని హీరోలు పిలిస్తేనే, ఆ అభిమానులు ఒకింత హర్టవుతారు. అలాంటిది, హీరోయిన్లు పిలిస్తేనో.?

‘క్యూట్’ కదా.. అని కొన్ని సార్లు, అభిమానులు లైట్ తీసుకుంటారు. కానీ, హీరోయిన్ పద్ధతి బాలేదని ఆ వెంటనే, చిరాకు పడతారు.!

హీరోయిన్ రష్మిక మండన్న ఇటీవల పదే పదే ‘ఏందిరా..’ అంటూ, అభిమానుల్ని ఉద్దేశించి అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది.

నిన్నటికి నిన్న ‘రణబాలి’ సినిమా ఈవెంట్ సందర్భంగా, రష్మిక మాట్లాడుతోంటే అభిమానులు తమదైన స్టయిల్లో సందడి చేశారు.

అయితే, తాను మాట్లాడుతోన్న ‘ఫ్లో’ దెబ్బ తింటోందన్న కోణంలో, ‘ఏందిరా..’ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి మాట జారింది రష్మిక మండన్న.

Rashmika Mandanna Endiraa.. మాట జారుతోంది.. ఊతపదంగా మారిపోతోంది..

మాట జారడం కాదు.. ‘ఏందిరా’ అనేది ఓ ఊతపదంలా మారిపోయింది రష్మికకి.! మరి, అభిమానులు కూడా, ‘ఏమే..’ అంటే, ఏమయిపోతుంది.?

అప్పుడు మళ్ళీ, ‘ఓ మహిళను పట్టుకుని ఇలాగేనా మాట్లాడేది.?’ అంటూ, చిన్మయి లాంటోళ్ళు సోషల్ మీడియాకెక్కి నానా యాగీ చేస్తారనుకోండి.. అది వేరే విషయం.

విజయ్ దేవరకొండ, ఇలా అభిమానులతో అత్యుత్సాహం ప్రదర్శించడం మామూలే. ఆ విజయ్ దేవరకొండ సతీమణి కదా, అదే బాటలో రష్మిక కూడా పయనిస్తోందన్నమాట.

ఏమో, అభిమానులు తమను రష్మిక ‘ఏందిరా’ అని ‘క్యూట్’గా పిలిస్తే హ్యాపీ ఫీలవుతారేమో.. కానీ, ‘ఏందిరా’ అనడం సభా మర్యాద కాదని రష్మిక తెలుసుకోకపోతే ఎలా.?

పబ్లిసిటీ స్టంట్ కాదు కదా..

సరే, సినిమా ప్రమోషన్స్ కోసం ‘కంటెంట్’ ఎలా వదలాలన్నదానిపై రష్మికకి ఖచ్చితమైన ప్లానింగ్ అంటూ ఒకటుంది. ఆ ప్లానింగ్ ప్రకారమే, రష్మిక ఆయవ వేదికలపై వాడే పద జాలం కూడా ఆధారపడి వుంటుంది.

అభిమానులు గలాటా చేయడం.. రష్మిక ‘ఏందిరా’ అంటూ తియ్యగా కసురుకోవడం.. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లలో భాగమేనంటారు కొందరు.

పీఆర్ టీమ్స్ ముందుగానే, రష్మిక సూచనలు సలహాల మేరకు అంతా సెటప్ చేస్తారన్న ప్రచారం టాలీవుడ్‌లో చాలా బలంగా జరుగుతోంది.

అన్నట్టు, విజయ్ దేవరకొండతో పెళ్ళయినట్లు లేదనీ, తానింకా విజయ్ ఫ్యాన్ గర్ల్‌నేనంటూ రష్మిక ‘రణబాలి’ ఈవెంట్‌లో వ్యాఖ్యానించడం కొసమెరుపు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group