India Vs Pakistan క్రికెట్‌కి సంబంధించినంతవరకు నరాలు తెగే ఉత్కంఠ.. అనే మాట తరచూ వినిపించేది ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీల సందర్భంగానే. ప్రపంచ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే, ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ జరిగినప్పుడూ, మరికొన్ని జట్ల మధ్య ఆధిపత్య పోరు నడచినప్పుడూ.. నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తుంది. అంతకు మించి.. అంటే మాత్రం భారత్ – పాక్ మధ్య మ్యాచ్ సందర్భంలోనే.
చాలా అరుదుగా మాత్రమే ఇటీవలి కాలంలో ఇండియా – పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో తలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యమే ఇందుకు కారణం. ఆట వేరు, ఇతరత్రా వివాదాలు వేరు.. అని ఎవరు ఎంతలా చెప్పినా, క్రికెట్ అంటే జస్ట్ ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి.!
India Vs Pakistan.. ఆ కిక్కే వేరప్పా..
టీ20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా భారత్ – పాక్ ఈ రోజు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ కప్ పోటీల్లో.. అది ఏ ఫార్మాట్ అయినా, టీమిండియాదే పై చేయి.. అది వన్డే అయినా, టీ20 అయినా.. పాకిస్తాన్ ఎప్పుడూ టీమిండియా ముందు బోల్తాపడుతూనే వచ్చింది.

‘గతంలోలా ఈసారి వుండబోదు..’ అని పాక్ అభిమానులు ప్రతిసారీ భావిస్తుంటారు.. బొక్కబోర్లాపడుతుంటారు. మరి, ఈసారి ఏం జరుగుతుంది.? వరుస ఓటములతో పాకిస్తాన్ ఎంత ఒత్తిడిలో వుంటుందో.. వరుసగా విజయాలు సాధిస్తున్న టీమిండియా కూడా అంతే ఒత్తిడిలో వుంటుంది. ఎందుకంటే, ఏ మాత్రం లైట్ తీసుకున్నా, ట్రాక్ రికార్డ్ తేడా కొట్టేస్తుంది మరి.
గెలిచేదెవ్వరు.? ఓడేదెవ్వరు.?
కోట్లాది మంది అభిమానుల ఆశల్ని ఇరు జట్లలోని ఆటగాళ్ళు తమ భుజాల మీద మోయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వరల్డ్ కప్ గెలవడం కంటే, పాకిస్తాన్ మీద గెలిచి, రికార్డుని పదిలం చేసుకోవడం ముఖ్యమనే భావన భారత క్రికెట్ అభిమానుల్లో (India Vs Pakistan) వుంటుంది. పాకిస్తాన్ అభిమానులదీ ఇదే వాదన.
Also Read: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఒకే ఒక్కడు.!
అంతిమంగా.. దీన్ని యుద్ధమనో.. ఇంకోటనో చెప్పడం సబబే కాదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే, ఇది జస్ట్ ఓ ఆట మాత్రమే. ఆ క్షణాన మైదానంలో ఎవరు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారో.. ఎవరికి టైమ్ కలిసొస్తుందో.. వాళ్ళే విజేతలు. ఇది పొట్టి క్రికెట్.. ఏ క్షణాన ఎలాంటి మ్యాజిక్ అయినా జరగొచ్చు. సో, హై ఓల్టేజ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్‌ని ఎంజాయ్ చేసేద్దాం.!