Table of Contents
Indian Railways Train Accident.. ఒరిస్సాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదాల్లో ఇదీ ఒకటని వార్తలు చూస్తున్నాం.!
అసలేం జరిగింది.? సీబీఐ విచారణ దిశగా రైల్వే బోర్డ్ నిర్ణయం తీసుకుందట.! అంటే, ఓ పది పాతికేళ్ళలో దోషులెవరో తేల్చుతారేమో.!
అదేంటీ, సీబీఐ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ కదా.? ఔను, అదీ నిజమే.! కానీ, చాలా కేసుల్లో సీబీఐ విచారణ ఎలా జరుగుతోందో చూస్తూనే వున్నాం.
Indian Railways Train Accident.. రైలు పట్టాల రాక్షసత్వం ఎవరిది.?
తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు విమానాలు సైతం అందుబాటులో వున్నాగానీ, రైలు ప్రయాణం.. చాలా చాలా ప్రత్యేకం.
డబ్బున్నోళ్ళయితే ఏసీ బోగీల్లో వెళతారు.. డబ్బు లేనోళ్ళయితే సాధారణ బోగీల్లో ప్రయాణిస్తారు.!
వందల మంది కాదు.. వేల మంది కాదు.. లక్షల మంది.. కోట్లాది మందికి రైలు ప్రయాణమంటే అదో ఎమోషన్.! అదో అవసరం.!
ప్రయాణీకుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ..
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandal Express) గురించి చాలామందికి తెలిసే వుంటుంది. అందులో ప్రయాణించేవారికి అదో స్పెషల్ ఎమోషన్ అంతే.
అత్యంత వేగంగా ప్రయాణించే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express), దాంతోపాటు, మరో సూపర్ ఫాస్ట్ రైలు.. ఒకేసారి ఒకే చోట ప్రమాదానికి గురయ్యాయి.

దాదాపు 300 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
తప్పెవరిది.?
ఇది తప్పు కాదు.! చాలా పెద్ద నేరం.! ఔను, 300 ప్రాణాలు పట్టాల మీద (Orissa Train Accident) నలిగిపోయాయంటే.. చిన్న విషయం కాదు.
కుట్ర కోణం ఏమైనా వుందా.? నిర్లక్ష్యం ఏమైనా వుందా.? ఏదైనాగానీ, అది క్షమార్హం కాని నేరం. నిర్లక్ష్యం ఏదైనా వుంటే మాత్రం.. ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే.
కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? దేశంలో చాలా రైళ్ళు నిత్యం పట్టాల మీద లక్షలాది మంది.. కోట్లాది మంది ప్రయాణీకుల్ని గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
చాలా రైళ్ళలో సౌకర్యాలు సరిగ్గా వుండవు. ఆయా బోగీల్ని చూస్తే, క్షేమంగా గమ్యస్థానాలకు చేరతామా.? లేదా.? అన్న అనుమానం వస్తుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. అంటూ హై స్పీడ్ రైళ్ళతో పబ్లిసిటీ స్టంట్స్ నడుస్తున్న రోజులివి. కానీ, పట్టాలపై ప్రయాణానికి సంబంధించి ప్రయాణీకుల భద్రతకు గ్యారంటీ ఏదీ.?