Indrani Mukerjea Sheena Bora.. తన కుమార్తెను, చెల్లెలిగా కొత్త భర్తకు పరిచయం చెయ్యడం ఎక్కడన్నా చూశామా.? పెరిగిన వయసుని కవర్ చేసుకోవడానికి బహుశా ఆ ‘కార్పొరేట్’ తెలివితేటలు వాడిందేమో.!
తండ్రి స్థానంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి తాలూకు కొడుకు.. అంటే, వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తితో ఓ యవతి ప్రేమలో పడటం ఎక్కడన్నా విన్నామా.?
కార్పొరేట్ పైత్యం అనాలా.? ఇంకేమన్నా అనాలా.? ఏమో, ఇలాంటివి చాలానే జరుగుతుండొచ్చు. విదేశాల్లో ఇవన్నీ మామూలే కావొచ్చు. కానీ, విషయం వెలుగులోకి వచ్చాక, దేశమే అవాక్కయ్యింది.
ఇంద్రాణి ముఖర్జీ.. పరిచయం అక్కర్లేని పేరిది. దేశ వ్యాపార వర్గాల్లో ఇంద్రాణి ముఖర్జీ ఓ సంచలనం. అనూహ్యంగా కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిందామె.
Indrani Mukerjea Sheena Bora .. కూతురు.. ఎలా చెల్లెలిగా మారింది.?
ఈ క్రమంలోనే తన కుమార్తెను చెల్లెలిగా తన కొత్త భర్తకు పరిచయం చేసి అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆ కుమార్తె, తన తల్లికి కొత్తగా భర్త అయిన వ్యక్తి తాలూకు వారసుడి మీద మనసు పారేసుకుంది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంద్రాణి కొత్త భర్త పీటర్, తన కొత్త భార్య కుమార్తె షీనా బోరా మీద కన్నేశాడట.. ఆ షీనా, తన కుమారుడితో ప్రేమలో వుందని తెలిసీ.! అలా ఇంద్రాణి, పీటర్ మధ్య కూడా వివాదం తల్తెతిందట.

ఇదేమీ సినిమా స్టోరీ కాదు. నిజ్జంగానే జరిగిందిది. అనూహ్యంగా ఆ కుమార్తె షీనా బోరా అదృశ్యమయ్యింది. తన బాయ్ ఫ్రెండ్ రాహుల్‌తో బ్రేకప్ అయినట్టుగా ఇంద్రాణీకి మెసేజ్ పెట్టి మాయమైపోయింది.
దాదాపు మూడేళ్ళ తర్వాత, షీనా బోరా ఎక్కడికీ పారిపోలేదు.. లోకం విడిచి పోయిందనే విషయం వెలుగులోకి వచ్చింది. షీనా బోరా హత్యకు గురైందనీ, ఆమె తల్లి ఇంద్రాని ఈ హత్య చేయించిందనీ తేలింది.
ఏళ్ళు గడుస్తున్నాయ్.. ఈ కేసులో నిజాలు అధికారికంగా నిగ్గు తేలడంలేదు. కార్పొరేట్ ఎంజాయ్‌మెంట్‌తో ఎప్పుడూ బిజీగా వుండే ఇంద్రాణి, జైలుకి పరిమితమైపోయింది ఏళ్ళ తరబడి.
నిజాలు నిగ్గు తేలేదెప్పుడు.?
ఎట్టకేలకు ఇంద్రాణికి (Indrani Mukerjea) బెయిల్ దొరికింది. ఈ కేసులో 50 శాతం మంది సాక్షుల్ని విచారించేందుకైనా చాలా సమయం పడుతుందని న్యాయస్థానమే అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
ఇందులో ఎవరిది తప్పు.? అనేది ఇప్పట్లో తేలదుగాక తేలదు. కానీ, ప్రేమించిన పాపానికి ప్రాణం కోల్పోయిందో యువతి.
తల్లి చేసిన తప్పు కారణంగా, వరసకు అన్నయ్య అయ్యే వ్యక్తిని ప్రేమించడమే షీనా బోరా చేసిన పాపమై, ఆమెను కాటేసింది.
ఈ కార్పొరేట్ డెత్ మిస్టరీ వీడింది.. దోషులెవరన్నది మాత్రం అధికారికంగా తేలలేదు. తేలబోదు కూడా.!