Isha Talwar Gundejaari Gallanthayyinde.. చేతులు పైకెత్తి సగం ముఖం కనిపించకుండానే ఓర చూపుతో కవ్విస్తోన్న ఈ కొంటె కోనంగిని గుర్తు పట్టారా.? గుండె జారి గల్లంతయ్యిందే.. నీ సొగసే చూసి.. అంటూ ఓ హీరో పాటందుకున్నాడు ఈ అందగత్తెను చూసి.
ఏమనుకున్నారు.. అలాంటి అందం ఈ ముద్దుగుమ్మది. చూస్తున్నారుగా.. తళ్వార్ చూపుల్తో ఎలా గాలమేస్తోందో. ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించిన ఈ క్యూట్ బ్యూటీ తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది.
అలాగే, కొన్ని పాపులర్ కమర్షియల్ యాడ్స్‌తోనూ ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇంతకీ ఎవరో కనిపెట్టారా.?
Isha Talwar Gundejaari Gallanthayyinde.. తల్వార్ చూపుల్తో ఉక్కిరి బిక్కిరి చేయొద్దంతలా.!
పైనే హింట్ ఇచ్చేశామ్‌గా.. అవునండీ.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మే ఈ అందాల భామ. పేరు ఇషా తల్వార్.

ఈ సినిమాలో నిత్యా మీనన్ మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా, మొట్ట మొదటగా నితిన్ మనసు కొల్లగొట్టి, గుండె జారి గల్లంతయ్యేలా చేసింది మాత్రం ఇషా తల్వారే.
ఇప్పుడు కూడా.. చూపుల్తోనే కాదు, నవ్వుల్తోనూ గిచ్చి గిల్లి అల్లరి చేస్తోంది నిషా కళ్ల ఇషా తల్వార్. సోఫాలో పడుకుని, ఇషా చేస్తున్న ఈ అందాల అల్లరి పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.
ఇషా తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినా యూత్‌లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అడపా దడపా హిందీ సినిమాల్లోనూ నటించేసింది.

అన్నట్లు ఈ మధ్య ఓటీటీలో ఎక్కువగా కనిపిస్తోంది ఇషా తల్వార్. ‘మీర్జాపూర్’, ‘సాస్ బహు ఔర్ ఫ్లెమింగో’ తదితర పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఇషా తల్వార్ నటించింది.
Also Read: Kajol Devgn Trial Kiss.. ఈ ముద్దు అవసరమా కాజోల్.!
త్వరలో ఇషా నటించిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అను వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ర్టీమింగ్ కానుంది.
			        
														