Iswarya Menon Waterfall Beauty.. ఐశ్వర్య మీనన్ తెలుసు కదా.! తెలుగులో ఆల్రెడీ రెండు సినిమాలు చేసేసింది.. మరికొన్ని ప్రాజెక్టులు ఈమెకి చర్చల దశలో వున్నాయట.
నిఖిల్ సిద్దార్ధ హీరోగా తెరకెక్కిన ‘స్పై’ సినిమాలోనూ, కార్తికేయ సరసన ‘భజే వాయు వేగం’ సినిమాలోనూ ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది.
సినిమాల సంగతి పక్కన పెడితే, ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా వుంటుంది. అదే, ఆమెకు బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చిపెడుతోంది కూడా.
Iswarya Menon Waterfall Beauty.. అందాల జలపాతం..
తాజాగా, ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జలపాతంలో ఈ అందాల భామని చూసి ‘వారెవ్వా’ అంటున్నారు నెటిజనం.

చూస్తున్నారుగా.. ఏ స్థాయిలో ఈ బ్యూటీ జలపాతంలో తడిసి ముద్దవుతోందో.! జలపాతం అంటే తనకు చాలా ఇష్టమనీ, ఆ శబ్దం.. సంగీతాన్ని తలపిస్తుందని ఐశ్వర్య మీనన్ చెప్పుకొచ్చింది.
అంతే కాదు, స్వచ్ఛమైన నీరు.. ఆ నీటికి ప్రకృతి అద్దే పరిమళం.. ఇవన్నీ అత్యద్భుతమైన అనుభూతిని ఇస్తాయంటోంది ఐశ్వర్య మీనన్.
నీ అందం కంటేనా.?
జలపాతం అందాల గురించి గొప్పగా చెబుతున్నావ్ సరే.. నీ సోయగం సంగతేంటి.? అని నెటిజనం ఐశ్వర్య మీనన్‌ని ప్రశ్నిస్తున్నారు.

ఎవరి గోల వారిది.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. ఆ అందాల జలపాతాన్ని ఈ అందాల భామ సోయగం డామినేట్ చేసేస్తోందని అనుకోవాలేమో.!