Jacqueline Fernandez.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పది కోట్ల రూపాయల విలువైన దోపిడీకి పాల్పడిందట బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్.!
నేరుగా కాదు, వేరే వ్యక్తి సుమారు 200 కోట్ల దోపిడీకి పాల్పడి, అందులో 10 కోట్లు జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌కి బహుమతుల రూపంలో సమర్పించుకోవడం ద్వారానట.
ఇదేదో ఉత్త ఆరోపణ కాదు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ మేరకు కేసు నమోదు చేసింది. జాక్వెలైన్ ఫెర్నాండెజ్ పేరుని నిందితురాలిగా చార్జిషీటులో నమోదు చేసింది.
Jacqueline Fernandez.. జాక్వెలైన్ దోపిడీ వెనుక..
ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా వున్న 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ పేరుని నిందితురాలిగా చేర్చారు.

జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ని సుఖేష్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్‌గా పేర్కొంటుండడం గమనార్హం. గత కొంతకాలంగా జాక్వెలైన్, సుకేష్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది.
ఇది ప్రేమాయణం కాదు, సహజీవనం.. అన్న వాదనలూ లేకపోలేదు. ఇంకోపక్క తనకీ జాక్వెలైన్‌కీ పెళ్ళి కూడా జరిగిపోయిందని సుకేష్ ప్రచారం చేసుకుంటున్నాడట.
శ్రీలంక నుంచి.. బాలీవుడ్ సినిమాల్లోకి..
నిజానికి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ శ్రీలంక బ్యూటీ. ఆమె అనూహ్యంగా బాలీవుడ్ తెరపైకొచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రోత్సాహంతో జాక్వెలైన్ విపరీతమైన స్టార్‌డమ్ సంపాదించుకుంది.
అన్నట్టు, తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’ సినిమాలో జాక్వెలైన్ ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసిన విషయం విదితమే. ఇటీవలే ‘విక్రాంత్ రోణ’ సినిమాలో ‘రారా రక్కమ్మా..’ అంటూ మరో స్పెషల్ సాంగ్ చేసింది జాక్వెలైన్.
Also Read: దటీజ్ ప్రభాస్.! నువ్వు దేవుడివి సామీ.!
ఖరీదైన కూపర్ కారు, వజ్రాల ఆభరణాలు, అత్యంత ఖరీదైన జిమ్ పరికరాలు.. ఇలా రకరకాల రూపాల్లో బహుమతులిచ్చాడట జాక్వెలైన్‌కి సుఖేష్.
ఈ విషయమై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. షరామామూలుగానే తనకేమీ ఈ ‘దోపిడీ’తో సంబంధం లేదని చెబుతోంది జాక్వెలైన్.
దొరికేదాకా అందరూ బుద్ధిమంతులే, దొరికాకనే దొంగలుగా తేలుతారు. మరి, జాక్వెలైన్ విషయంలో ఏం జరుగుతుందో.?
అయినా, ప్రియురాలికి ఖరీదైన బహుమతుల్ని ప్రియుడు ఇస్తే, ఆ ప్రియురాలి తప్పేముంటుంది అధ్యక్షా.?